ద్వారకా తిరుమల :
దీనినే " చిన్న తిరుపతి " అని కూడా అంటుంటారు.ఇక్కడ శేషాద్రి కొండపై శ్రీ
వేంకటేశ్వర స్వామి కొలువు దీరియున్నారు. ఇది ఉభయ గోదావరి, కృష్ణా
జిల్లాల్లో చాలా ప్రసిద్ది చెందిన దేవాలయము. స్వయంభువుగా ప్రత్యక్షమైన
వేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు
మీదుగా ఈ ప్రదేశమునకు ద్వారక తిరుమల అని పేరు వచ్చినది. సుదర్శన క్షేత్రమైన
ద్వారక తిరుమల చిన్నతిరుపతిగా ప్రసిద్ది చెందినది. ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. కనుక ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాభిముఖుడై యున్నాడు.
"పెద్దతిరుపతి" (తిరుమల తిరుపతి)లో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును
"చిన్నతిరుపతి"లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుంది. కాని చిన్నతిరుపతిలో
తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని
స్థానికంగా భక్తుల నమ్మకం. ఒకే విమాన శిఖరము క్రింద రెండు విగ్రహములు
ఉండటము ఇక్కడి విశేషము. ఒక విగ్రహము సంపూర్ణమైనది. రెండవది స్వామియొక్క పై
భాగము మాత్రమే కనుపించు అర్ధ విగ్రహము.
Visheshalu :
1. శేషాచలము, అనంతగిరి అని పిలువబడే ఈ ద్వారకా తిరుమల క్షేత్ర మహత్యం బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది.
2 .మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉడడం కూడా అరుదు.
3 .ఒకే గోపురం కింద రెండు విగ్రహాలు ఉండటం ఇక్కడి విశేషం. స్వామి అసలు
విగ్రహం వక్షస్థలం వరకు మాత్రమే కనిపిస్తుంది. మిగతా భాగం కొండలోనే
నిక్షిప్తమై ఉంది.
స్వామి వెనుక భాగంలో ఉండే పూర్తి విగ్రహాన్ని (రెండోది) పదకొండో శతాబ్దంలో శ్రీమద్రామానుజుల వారు ప్రతిష్ఠించారు.
4. పెద్దతిరుపతి" (తిరుమల తిరుపతి)లో తీర్చుకోవడానికి మ్రొక్కిన
మ్రొక్కును "చిన్నతిరుపతి"లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుంది. కాని
చిన్నతిరుపతిలో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే
తీర్చుకోవాలని భక్తుల నమ్మకం.
5 .ఇక్కడ స్వామి వారికి అభిషేకము
చేయక పోవడము ఇంకొక విశేషము. ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామి
విగ్రహము క్రిందనున్న ఎర్రచీమలను కదుల్చును. ఆ పుట్టలో స్వామి వున్నట్లున్న
పాద ముద్రికలు ఇప్పటికి కనబడుతున్నాయట.
6. ఇక్కడ ఒక కుంకుడు
చెట్టుంది. ఈ చెట్టు మీద గరుడ పక్షి కొన్ని సమయాల్లో వచ్చి వ్రాలుతుందట.
ఆనాడు శ్రీవేంకటేశుడు తిరుపతి నుండి ద్వారకా తిరుమలకి వస్తారని ప్రతీతి.
ఇక్కడ దొరికే ప్రతిశిల యందు సుదర్శన ముద్ర కన్పిస్తుంది. ఇది చాలా గొప్ప విశేషమయిన సంగతి.
7. ఆలయ సింహద్వారములు వేసినా, మబ్బుపట్టి చీకట్లు కమ్ముకొన్నా ఆలయగోపురము
నుండి ఒక దివ్యమైన జ్యోతి దర్శనమిస్తుంది. దగ్గర నుంచి అయితే చిన్న
దీపంగాను 200 మీటర్ల దూరం నుంచి చూస్తే పెద్ద వెలుగుగాను చూడవచ్చు
స్థల పురాణము ప్రకారము ఈ క్షేత్రము రాముని తండ్రి దశరథ మహారాజు కాలము
నాటిదని భావిస్తారు. "ద్వారకుడు" అనే ఋషి తపసు చేసి స్వామివారి పాదసేవను
కోరాడు. కనుక పాదములు పూజించే భాగ్యం అతనికి దక్కింది. పైభాగము మాత్రమే
మనకు దర్శనమిస్తుంది. విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ
క్షేత్రాన్ని దర్శించినారనీ, అందరూ స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం
కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధృవమూర్తికి
వెనుకవైపు పీఠంపై వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్టించారని అంటారు. స్వయంభువుగా
వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే, ప్రతిమను కొలిచినందువలన మోక్షం
సిద్ధిస్తుందనీ, తరువాత ప్రతిష్టింపబడిన పూర్తిగా కనుపించే ప్రతిమను
కొలిచినందువలన ధర్మార్ధకామ పురుషార్ధములు సమకూరుతాయనీ భక్తుల విశ్వాసం.
ప్రతియేటా రెండు కళ్యానోత్సవములు వైశాఖ మరియు ఆశ్వయిజ మాసములలో జరుపుతారు.
ఇందుకు కారణం- స్వయంభూమూర్తి వైశాఖమాసంలో దర్శనమిచ్చారనీ, సంపూర్ణ
విగ్రహాన్ని ఆశ్వయుజంలో ప్రతిష్టించారనీ చెబుతారు.
గర్భగుడిలో
స్వయంభూ వేంకటేశ్వర స్వామి, ప్రతిష్టింపబడిన వేంకటేశ్వరస్వామి ప్రతిమలు
కన్నులపండువుగా దర్శనమిస్తాయి. ఆ ప్రక్కనే కుడివైపు అర్ధ మంటపంలో తూర్పు
ముఖంగా మంగతాయారు, అండాళ్ (శ్రీదేవి, భూదేవి) అమ్మవార్లు కొలువై ఉన్నారు.
శుక్రవారం అమ్మవార్లకు విశేష కుంకుమపూజ చేస్తారు.
కొండపైన
ప్రధానాలయానికి నాయువ్య దిశలో కొద్దిదూరంలోనే కొండమల్లేశ్వరస్వామి,
భ్రమరాంబికల ఆలయం ఉంది. భ్రమరాంబా మల్లేశ్వరస్వామి ఈ ద్వారకా తిరుమల
క్షేత్రానికి క్షేత్ర పాలకుడు. మొత్తం కొండ సర్పరాజు అనంతుని ఆకారంలో
ఉన్నదనీ, తలపైన శివుడు, తోక పైన విష్ణువు కొలువు తీరారనీ చెబుతారు. ఈ
దేవాలయంలో గణపతి, భ్రమరాంబ, మల్లేశ్వరస్వామి కొలువుతీరు ఉన్నారు. నవగ్రహ
మందిరం కూడా ఉంది. ఆలయం తూర్పున "శివోద్యానం" అనే పూలతోట ఉంది.
ఆలయం కొండకు 1 కి.మీ. దూరంలో "కుంకుళ్ళమ్మ" ఆలయం ఉంది. ఈమె ఈ వూరి
గ్రామదేవత. ప్రధాన ఆలయంలో స్వామి దర్శనం చేసుకొన్న భక్తులు తిరిగి వెళుతూ
కుంకుళ్ళమ్మ దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. ఈ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు
వైభవంగా జరుపుతారు.
Friday, July 19, 2013
Thursday, July 18, 2013
శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం ( అన్నవరం )
అన్నవరం ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలానికి చెందిన గ్రామము. అన్నవరం కలకత్తా - మద్రాసు జాతీయ రహదారి పై రాజమండ్రి నుండి దాదాపుగా 70 కి.మీ, కాకినాడ కి 45 కి.మి. దూరంలో ఉంది. ఈ గ్రామంలోని అన్నవరం రైల్వే స్టేషన్ విశాఖపట్టణం-విజయవాడ రైలుమార్గంలో వస్తుంది.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ కొలువైన త్రిమూర్తి నిలయం అన్నవరం. ఈ ఆలయం రెండు అంతస్థులలో నిర్మింపబడింది. క్రింది భాగంలో యంత్రం, పై అంతస్థులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంది. క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణు మూర్తి గా అర్చిస్తారు, మధ్యభాగంలో ఉన్నదానిని శివునిగా పూజిస్తారు. మూలవిరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింప బడడం ఇక్కడి విశేషం. త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉన్నది. అలా త్రిమూర్తులు వెలసిన ఈ అరుదైన ఆలయానికి యుగాల చరిత్ర ఉందంటారు భక్తులు.
శ్రీ సత్యనారాయణ స్వామివారిని ఈ క్రింది విధంగా స్తుతిస్తారు.
మూలతో బ్రహ్మరూపాయ
మధ్యతశ్చ మహేశ్వరం
అధతో విష్ణురూపాయ
త్ర్త్యెక్య రూపాయతేనమః
స్థలపురాణం:
పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందారు. వారు రత్నాకరుడు, భద్రుడు. వీరు పరమ విష్ణు భక్తులు. వారు హరిని తమ శిరస్సున దాల్చాలన్న కోరికతో తపస్సు చేసారు. వారి కోరిక మేరకు నారాయణుడు భద్రుని శిరస్సుపై (భద్రాచలం) వైకుంఠ రాముడిగానూ, రత్నాకరుడి (రత్న గిరి)పై సత్యనారాయణుడి గానూ అవతరించారు.
దేవాలయ ప్రాశస్తి:
తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురంకి సమీపంలో గోరస గ్రామ ప్రభువు (గోర్సా, కిర్లంపూడి ఎస్టేట్స్) శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామానారాయణం బహద్దరు రాజా ఐ.వి.రామనారాయణం వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు వీరికీ, శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామానారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియా మఖా నక్షత్రములో గురువారము నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారము ప్రతిష్టించి సేవించుము" అని చెప్పి మాయమయ్యారు.
మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరు అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామి వారి పాదముల మీద సూర్యకిరణములు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకొని పోయి, కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891, ఆగష్టు 6 వ తేదీన (శాలివాహన శకం 1813) ప్రతిష్టించారు.
ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి, నాలుగు దిక్కులలో నాలుగు చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునక. వనదుర్గ ఆలయం, రామాలయాలు ప్రక్కన కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రూపం, అగ్ని పురాణంలో చెప్పబడినట్లు, ప్రకృతిని తలపిస్తూ ఉండాలి.
పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నములు గలవి, శూల శిఖరములతో ఉన్నవి అయిన రెండు చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్య దేవతా, అంబికా దేవతా ప్రతీకలగు చక్రశిఖరములు ఉన్న మరి రెండు విమాన గోపురాలూ ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధములైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం.
పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ గుడికి పాదచారులు చేరు కోవడానికి 460 మెట్లు ఉన్నాయి.
ప్రతీ ఏటా పదిలక్షల మంది భక్తులు అన్నవరంలో వ్రతమాచరిస్తారని అంచనా.
వీరత్వానికీ, సత్యానికీ ప్రతీకగా భావించే మీసాలరాముడి కల్యాణోత్సవాలను ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి బహుళ పాడ్యమి వరకూ అంగరంగ వైభవంగా జరుపుతారు భక్తులు.
ఇక్కడి ఇంకో విశేషం ప్రసాదం. గోధుమరవ్వతో ఆలయ ప్రసాదశాలలో తయారయ్యే ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బయటి వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ రుచి మాత్రం రాదు.

1.
ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు.
ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో , ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా
పరిగణిస్తారు.
ప్రతీసంవత్సరం ఆషాడ శుద్ధ ఏకాదశిని 'తొలిఏకాదశి' గా అంటారు. ఎందుచేతనంటే! పూర్వకాలమందు ఈ తోలిఏకాదశితోనే, సంవత్సర ప్రారంభంగా కూడ చూచేవారట! ఈ రోజును 'శయన ఏకాదశి' అనికూడా పిలుస్తారు ఎందువల్లననగా; శ్రీమహావిష్ణువు ఆరోజునుండి కార్తీకశుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉంటారని, నాటినుండి శ్రీహరిభక్తులు కామక్రోధాధులు వర్జించి ప్రయాణాలు చేయకుండా ఒకేచోట ఉండి శ్రీహరిని అర్చిస్తూ తిరిగి కార్తీకశుద్ధ ఏకాదశి 'ఉత్థాన ఏకాదశి' వరకు ఆనాలుగు మాసములు చాతుర్మాస్య వ్రతం చేయుట కూడా మన భారతీయ సంప్రదాయములలో ఒకటి. ఆరోజు 'శ్రీహరి' శేషతల్పం పైనుండి మేల్కొంటారు. ఈ చాతుర్మాస్య దీక్షను సన్యాసులు మాత్రమేకాదు. సంసారులు, వయో, లింగబేధము లేకుండా భక్తులందరూ దీనిని ఆచరిస్తూ ఉంటారు.
ఈ 'తొలి ఏకాదశి' నాడు "గోపద్మ వ్రతం" చేయుట ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు.
ఈ గోమాత పూర్తిగా విరాట్ పురుషుని రూపంతో పోల్చబడింది. గోవునకు ముఖమునందు వేదాలు, కొమ్మలయందు హరిహరులు, కొమ్ముల చివర ఇంద్రుడు, లలాటమున ఈశ్వరుడు, కర్ణములందు అశ్వనీదేవతలు నేత్రములందు సూర్యచంద్రులు, దంతములయందు గరుడుడు, జిహ్వయందు సరస్వతి, ఉదరమునందు స్కందుడు, రోమకూపములందు ఋషులు, పూర్వభాగమునందు యముడు, పశ్చిమ భాగమునందు అగ్ని, దక్షిణభాగమున వరుణ కుబేరులు, వామభాగము నందు యక్షులు, ముఖమునందు గంధర్వులు, నాసాగ్రమందు పన్నగలు, అపానంబున సరస్వతి, గంగాతీర్థంబులు, గోమయంబున లక్ష్మీ, పాదాగ్రంబున ఖేచరులును, అంబా అంటూ అరచే అరుపులో ప్రజాపతి, స్థనములందు చతుస్సాగరములు ఉన్నట్లుగా వర్ణింపబడెను. కావున గోవును పూజిస్తే! సమస్త దేవతలను పూజించి నట్లేనని, సమస్త తీర్థములలో పుణ్యస్నానంచేసిన పుణ్యఫలం లభిస్తుందని 'గోమాతకు' ఇంత పూజ్యస్తానమిస్తూ, అధర్వణ వేదంలో బ్రహ్మాండపురాణంలో, మాహాభారతంలో, పద్మపురాణంలో ఇలా ఎన్నో గాధలు ఉన్నాయి.
అట్టి గోమాత నివశించే గోశాలను ఈ 'తొలిఏకాదశి' దినమందు మరింతగా శుభ్రముచేసి అలికి ముత్యాల ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్ది గోశాల మధ్యభాగమందు బియ్యపు పిండితో ముప్పైమూడు పద్మాల ముగ్గులు పెట్టి, శ్రీమహాలక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువు ప్రతిమను ఆపద్మములపైనుంచి, వారిని విధివిధానంగా పూజించి, పద్మానికి ఒక్కొక్క "అప్పడాన్ని" వాటిపై ఉంచి ఆ అప్పడాలను వాయనాలను, దక్షిణ తాంబూలాదులలో బ్రాహ్మణుని సంతుష్టుని గావించి, గోమాతను పూజించువార్కి సకలలాభీష్టములు తప్పక నెరవేరుతాయని చెప్పబడినది. అలా, గోపద్మవ్రతం చెయ్యాలి.
ఇంత పుణ్యప్రదమైన తొలిఏకాదశి పర్వదినం శుభప్రదముగా జరుపుకుని పునీతులౌదాము
-------------------------- -------------------------- -------------------------- ----
2.ఆషాఢ శుక్ల ఏకాదశి/శయన ఏకాదశి :
ఒక సంవత్సరములో మనకు 24 ఎకాదశులు వచ్చును అందులో ముఖ్యమైనది శయన ఏకాదశి, పరివర్తన ఏకాదశి మరియు ఉత్థాన ఏకాదశి బహు విశిష్టమైనది మిగత యెకాదశులలో ఉపవాసము ఉండలేక పోయినా ఈ మూడు ఎకాదశులలో ఉపవాసము వుంది మహాలక్ష్మీ సహిత మహావిష్ణుని పూజించిన 24 ఏకాదశులలో ఉపవాసము ఉన్న ఫలితము దక్కును
శయన ఏకాదశి రోజు దంపతులు ప్రొద్దున ఉపవాసము ఉండి సాయంకాలము సూర్య అస్తమనం అయిన తర్వాత సంధ్యావందనం కానిచ్చి పూజ మందిరములో పట్టు వస్త్రము పరచి దానిపైన మహాలక్ష్మీ సమేత మహావిష్ణు పటమును వుంచి మల్లెలు తామార పువ్వులతో అష్టోత్తర శతనామములతో పూజించి పాల అన్నము నివేదన చేసి నమస్కరించి విష్ణు సహస్ర నామము జపించి రాత్రి ఈ క్రింది స్లోకముతో నమస్కరించ వలెను
***వాసుదేవ జగద్యోనే ప్రాప్తేయం ద్వాదశి తవ భుజంగ సయనేబ్దౌ చ సుఖం స్వపిహి మాధవ
ఇయం తు ద్వాదశి దేవా శయనార్థం వినిర్మితా అస్యాం సుప్తే జగన్నాథ జగత్ సుప్తం భవేదిడం విబుద్దే త్వయి భుధ్యేత్ సర్వమేతత్ చరాచరం
ఫలితం : దీనివల్ల మనము శయనిన్చుటకు మంచి గృహము మంచి పడుకయు మరియు పండుకోనగానే సుఖమైన నిద్ర లభించును

3.
లక్ష్యమును నిరవేర్చు లక్ష ప్రదక్షిణ వ్రతము 19 07 2013 to 13.11.2013
దైవారాధన విధానములో బహు సులభమైన మార్గము దేవతలను ప్రదక్షిణము చేయుటయే ఆషాఢ సుద్ద ద్వాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి అనగా 13.11.2013 వరకు ఆలయములలోనో లేక అశ్వథ వ్రుక్షమునో లేక పశువునో లక్ష మారులు ప్రదక్షిణము చేయవలెను వీలుకాని యెడల తక్కువ పక్షము వేయి మార్లైనను తప్పకుండ ప్రదక్షిణము చేయవలెను అప్పుడు చెప్పవలసిన శ్లోకములు
**విష్ణువునకు: అనంత మవ్యయం విష్ణుం లక్షిమి నారాయణం హరిం జగదీశా నమస్తుభ్యం ప్రదక్షిణ పదే పదే
**హనుమకు: రామదూత మహావీర రుద్ర బీజ సముద్భవ అంజనా గర్భ సంభూత వాయుపుత్ర నమోస్తుతే
**గోవుకు : గవాం అన్గేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మే స్యాత్ ఇహ లోకే పరత్రచ
ఈ ప్రదక్షిణముల వలన మన పాప రాశి అంతయు దగ్ధమై మన జీవితం ప్రశాంతముగా ఉండును.

--------------------------

Tuesday, July 9, 2013
July 15 2013 నుండి ఉత్తరాయణం వెళ్లి దక్షిణాయణం ప్రారంభం అవుతుంది!
అసలు ఉత్తరాయణం, దక్షిణాయణం అంటే ఏంటి?
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అప్పటి నుండి ప్రారంభం అవుతుంది ఉత్తరాయణం! దీన్ని మనం చాల తేలికగా కనిపెట్టవచ్చు! సూర్యుడు ఉత్తరం వైపు నుండి ఉదయిస్తాడు! అంటే తూర్పు వైపు మీరు నుంచుంటే ఎండ వల్ల మీ నీడ మీ కుడివైపు పడుతుంది! గమనించండి!
సూర్యుడు కర్కాటక రాశి లో ప్రవేసిస్తాడు! దక్షిణాయణం అంటే దక్షిణం వైపునుండి ఉదయిస్తాడు! ఇప్పుడు మీ నీడ ఎడమ వైపు పడుతుంది! ఇది దక్షిణాయణం!
ఈ దక్షిణాయనం లో దేవతలు నిద్రిస్తారు! ఆ సమయంలో మనకి పండగలు ఎక్కువగా వస్తాయి ఎందుకంటే మనం చేసే పూజలు దేవతలకి శక్తులు ఇస్తాయి (మనం అలసిపోయి పడుకుంటే విశ్వ శక్తి మనలో ప్రవేశించి ఎంత శక్తిని ఇస్తుందో మనం చేసే పూజలు వారికీ అలా శక్తిని ఇస్తాయి)! ఉత్తరాయణంలో దేవతలు మేల్కొంటారు! ఆ సమయంలో దేవతలు మనకి అన్ని విధాలుగా ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారు!
మన సంవత్సరం దేవతలకిఒక్క రోజు! ఉత్తరాయణం పగలు! దక్షిణాయనం రాత్రి!

శ్రీ జగన్నాధ స్వామి రధయాత్ర - July 10th 2013
ఆషాఢ శుద్ధ విదియ నాడు మోక్ష క్షెత్రమైన "పూరీ" లో జగన్నాధ బలభద్ర సుభద్ర రధయాత్ర అత్యంత వైభవం గా జరుగుతుంది.
జగత్ప్రసిద్ధమైన ఈ రధయాత్ర పరమ పావనం.
"రధస్థం వామనం ద్రుష్ట్వా పునర్జన్మ న విద్యతే " -- రధాన్న ఉన్న వామనుని చుసిన వారికి పునర్జన్మ ఉందడు .
ఈ రోజునే శ్రీ రాముని రథోత్సవం అని ధర్మశాస్త్ర వచనం !
విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఇది .
హరె రామ హరె రామ రామ రామ హరె హరె
హరె కృష్ణ హరె కృష్ణ కృష్ణ కృష్ణ హరె హరె !
శ్రీ జగన్నాధ స్వామి రధయాత్ర - July 10th 2013 ఆషాఢ శుద్ధ విదియ నాడు మోక్ష క్షెత్రమైన "పూరీ" లో జగన్నాధ బలభద్ర సుభద్ర రధయాత్ర అత్యంత వైభవం గా జరుగుతుంది. జగత్ప్రసిద్ధమైన ఈ రధయాత్ర పరమ పావనం. "రధస్థం వామనం ద్రుష్ట్వా పునర్జన్మ న విద్యతే " -- రధాన్న ఉన్న వామనుని చుసిన వారికి పునర్జన్మ ఉందడు . ఈ రోజునే శ్రీ రాముని రథోత్సవం అని ధర్మశాస్త్ర వచనం ! విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఇది . హరె రామ హరె రామ రామ రామ హరె హరె హరె కృష్ణ హరె కృష్ణ కృష్ణ కృష్ణ హరె హరె !
అష్టాదశ పురాణాలు
1. మత్స్య పురాణం : మత్స్యావతారమెత్తిన శ్రీ మహావిష్ణువు మనువుకు బోధించిన పురాణం ఇది. యయాతి, సావిత్రి, కార్తికేయ చరిత్రలు ఇందులో ఉన్నాయి. అంతేకాక వారణాసి, ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాల వివరణ ఇందులో ఉంది.
2. మార్కండేయ పురాణం : ఇది మార్కండేయ ఋషి చెప్పినది కనుక దీనికి ఈ పేరు వచ్చింది. శివుడు, విష్ణువు, ఇంద్రుడు, అగ్నిదేవుడు, సూర్యుల మహత్తు గురించి ఇందులో వివరించారు.
3. భాగవత పురాణం : దీన్ని తెలుగులోకి పోతన కవి అనువదించారు కనుక తెలుగు ప్రజలకు ఇది చిరపరిచితమైన పురాణమే. ఇందులో మహావిష్ణు అవతారాల గురించి , శ్రీకృష్ణుని లీలల గురించి వివరించారు. తెలుగులో ఇది మొత్తం 12 స్కంధాల గ్రంధం.
4. భవిష్య పురాణం : ఇది సూర్యభగవానుడు మనువుకు చెప్పిన పురాణం. ఇందులో వర్ణాశ్రమాల ధర్మాల అగురించ్, భవిష్యత్తులో జరగబోయే పరిణామాల గురించి వివరించారు.
5. బ్రహ్మ పురాణం : ఇది దక్షునికి బ్రహ్మదేవుడు చెప్పిన పురాణం. శ్రీకృష్ణుడు, మార్కండేయుడు, కశ్యపుల జీవన గాథలు ఉన్నాయి.
6., బ్రహ్మాండ పురాణం : బ్రహ్మ మరీచికి చెప్పిన పురాణం ఇది. పరశురాముడి గురించి, రాముడి గురించి, శ్రీకృష్ణుని గురించి ఇందులో వివరించారు. ఇందులో దేవతాస్తోత్ర శ్లోకాలు కూడా ఉన్నాయి.
7. బ్రహ్మవైవర్త పురాణం : ఇది నారద మహర్షికి సావర్ణుడు చెప్పిన పురాణం. సృష్టికి మూలమైన భౌతిక జగత్తు గురించి, పంచమహా శక్తుల గురించి ఇందులో ఉంది.
8. వరాహ పురాణం : ఇది విష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన పురాణం. పార్వతీ పరమేశ్వర చరిత్ర, ధర్మశాస్త్ర శ్లోకాలు, వ్రత విధానాలు ఇందులో ఉన్నాయి.
9.వామన పురాణం : నారదునికి పులస్త్య ఋషి వివరించిన పురాణం ఇది. శివపార్వతుల కళ్యాణం, కార్తికేయగాధ, భూగోళ వర్ణన, రుతువర్ణన ఇందులో ఉన్నాయి. ఆర్యభట్టులాంటి ఖగోళ శాస్త్రవేత్తలు ఈ పురాణాన్ని శ్రద్ధగా చదివినట్లు ఆధారాలున్నాయి.
10. వాయు పురాణం : ఇది వాయుదేవుడు ఉపదేశించిన పురాణం. ఇందులో శివమహత్యముతో పాటు భూగోళ వర్ణన, సౌరమండల వ్యవస్థ వర్ణన కూడా ఉండి. మన ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలు ఈ పురాణాన్ని కూడా అధ్యయనం చేశారు.
11. విష్ణు పురాణం : ఇది మైత్రేయునికి పరాశర మహర్షి ఉపదేశించిన పురాణం. విష్ణు, శ్రీకృష్ణ, ధృవ, ప్రహ్లాద, భరతుల గురించి విపులంగా వివరించారు.
12. నారద పురాణం : ఇది నారదుడు నలుగురు బ్రహ్మ మానసపుత్రులకు చెప్పిన పురాణం. ఇందులో వ్రతాల గురించి, వేదాంగాల గురించి కూడా వివరించారు. వివిధ పుణ్యక్షేత్రాల వర్ణన ఇందులో ఉంది.
13. అగ్ని పురాణం : ఇది అగ్నిదేవుడు ప్రవచించిన పురాణం. వైద్యం, వ్యాకరణం, చందస్సు, భూగోళ శాస్త్రం, జ్యోతిష్యం గురించి ఇందులో ఉన్నాయి.
14. స్కంద పురాణం : ఇది స్కందుడు చెప్పిన పురాణం. ఇందులో అనేక వ్రతాల గురించి, శివమాహత్మ్యం గురించి ఇంకా వివిధ పుణ్యక్షేత్రాల గురించి వివరించారు.
15. గరుడ పురాణం : ఇది తన వాహనమైన గరుడునికి (గరుత్మంతునికి) శ్రీమహావిష్ణువు ఉపదేశించిన పురాణం. గరుడుని జన్మవృత్తాంతముతో పాటు స్వర్గలోకం గురించి, నరకలోకం గురించి, విష్ణు ఉపాసన గురించి ఇందులో వివరించారు.
16. లింగ పురాణం : ఇందులో శివుని ఉపదేశాలు, ఇతర వ్రతాలు, ఖగోళశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం మొదలైన వాటి గురించి వివరించారు.
17. కూర్మ పురాణం : శ్రీమహావిష్ణువు కూర్మావతారంలో ఉపదేశించిన పురాణం కనుకే దీనికి ఈ పేరు వచ్చింది. ఇందులో వరాహ అవతారం గురించి, నరసింహావతారం గురించి వివరించారు. భూగోళం గురించి కూడా వివరించారు.
18. పద్మ పురాణం : 18 పురాణాలలోకెల్లా ఇది పెద్దది. ఇందులో బ్రహ్మ చేసిన సృష్టి గురించి, గంగా మహాత్మ్యం గురించి, గాయత్రీ చరితం గురించి, గీత గురించి, పూజా విధానం గురించి వివరంగా వర్ణించారు.

Friday, July 5, 2013
వివిధ సందర్భాలలో పఠించదగు శ్లోకములు
వివిధ సందర్భాలలో పఠించదగు శ్లోకములు
ఉదయం నిద్ర లేచిన వెంటనే పఠించు ధ్యానము:
బ్రహ్మమురారి త్రిపురాంతకారీ భానుశ్శశిః భూమిసుతో బుధశ్చ
గురుశ్చ శుక్రశ్శని రాహుకేతవః కుర్వంతు సర్వే మమ సుప్రభాతం.
విష్ణుశక్తి సముత్పన్నే చిత్రవర్ణ మహీతలే
అనేకరత్న సంపన్నే పాదఘాత క్షమా భవ.
కరాగ్రే వసతే లక్ష్మీః కర మధ్యే సరస్వతీ
కరమూలేతు గోవిందః ప్రభాతే కర దర్శనం.
సముద్ర వసనే దేవి పర్వత స్తనమండితే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్యమే.
స్నానము చేయునపుడు పఠించవలసినవి:
గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు.
ఆవాహయామి త్వాం దేవి స్నానార్థమిహ సుందరి
ఏహి గంగే నమస్తుభ్యం సర్వతీర్థ సమన్వితే.
పుష్కరాద్యాని తీర్థాని గంగాద్యా సరిత స్తథా
ఆగచ్ఛంతు మహాభాగా స్నానకాలే సదా మమ.
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతో2పివా
యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్శుచిః
పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్ష!
గణపతి ప్రార్ధన:
శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం.
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే.
పార్వతీ పరమేశ్వర ప్రార్థన:
వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే.
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.
గురు ప్రార్థన:
గురు బ్రహ్మ గురు విష్ణుః గురుర్దేవో మహేశ్వరః.
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
ధ్యాన మూలం గురోర్మూర్తిః పూజా మూలం గురోః పదం
మంత్ర మూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా.
సరస్వతీ ప్రార్థన:
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమేసదా.
పద్మ పత్ర విశాలాక్షి పద్మ కేశరవర్ణనీ
నిత్యం పద్మాలయాం దేవి సామాంపాతు
సరస్వతీ భగవతీ భారతీ నిశ్శేషజాడ్యాపహా.
దక్షిణామూర్తి ప్రార్థన:
ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ్ ఙ్ఞానైకమూర్తయే
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణా మూర్తయే నమః.
గురవే సర్వ లోకానాం భిషజే భవరోగిణాం
నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః.
భోజనమునకు ముందు:
శ్లో: బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతం
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా .
శ్లో:అన్న పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్లభే
ఙాన వైరాగ్య సిధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతీ.
శ్లో: అహం వైస్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం.
ఓం నమో నారాయణాయ.
భోజనమునకు తరువాత:
అగస్త్యం కుంభకర్ణం చ శమ్యం చ బడబానలం
ఆహారపరిణామార్థం స్మరామి చ వృకోదరం.
సంధ్యా దీపమునకు:
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే.
నిద్రకు ఉపక్రమించునపుడు :
అచ్యుతం కేశవం విష్ణుం హరిం సత్యం జనార్దనం
హంసం నారాయణం కృష్ణం జపేద్దుస్వప్న శాంతయే.
రామస్కంధం హనూమంతం వైనతేయం వృకోదరం
శయనేయసి స్మరేన్నిత్యం దుస్వప్నస్తస్య నశ్యతి.
ఇంటి నుండి కార్యార్థులై వెళ్లునపుడు:
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయమంగళం.
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః
యేషామిందీ వరస్యామో హృదయస్థో జనార్దనః.
ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
ఔషధ సేవనము చేయునపుడు:
ధన్వంత్రిణం గరుత్మంతం ఫణిరాజంచ కౌస్తుభం
అచ్యుతం చామృతం చంద్రం స్మరేదౌషధ కర్మణి.
శరీరే జర్జరీభూతే వ్యాధి గ్రస్తేకళేబరే
ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరిః.
Subscribe to:
Posts (Atom)