సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాల ప్రాముఖ్యత
శివుని కుమారునిగా పూజలందుకునే సుబ్రహ్మణ్యస్వామికి పురాణాల పరంగా ఎంతో
ప్రాముఖ్యత ఉంది. తండ్రికే జ్ఞానబోధ చేసిన కుమారునిగా సుబ్రమణ్యస్వామి
అన్ని దైవాలతో తనకున్న ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆరు ముఖాలతో కూడిన
స్వామిగా నిత్యం భక్తుల చేత పూజలందుకునే సుబ్రమణ్యేశ్వరునికి తమిళనాడులోనే
అనేక ఆలయాలు అధికంగా ఉండడం విశేషం.
ఆంద్రప్రదేశ్ లో శైవ, వైష్ణవ క్షేత్రాలు అధికంగా ఉన్నట్టుగానే
తమిళనాడులో సుబ్రమణ్యేశ్వరుని ఆలయాలు ఎక్కువ సంఖ్యలో కొలువై ఉన్నాయి.
ఆరుముఖల స్వామిగా తమిళులకు ప్రీతిపాత్రమైన సుబ్రమణ్యేశ్వరుని ఆరు దివ్య
ఆలయాలు కూడా తమిళనాడులోనే ఉన్నాయి. సుబ్రమణ్యేశ్వరుని దివ్య రూపాలను
దర్శించాలనుకునే వారు ఈ ఆరు క్షేత్రాలను దర్శిస్తే సరిపోతుంది.
తిరుచందూర్
సముద్రం పక్కనే కొలువైన అతి ప్రాచీన సుబ్రమణ్యేశ్వరుని దేవాలయం తిరుచందూర్
లో ఉంది. సరన్ అనే రాక్షస రాజును సంహరించేందుకోసం స్వామివారు ఈ తిరుచందూర్
లో కొలువై నిలిచారట. తిరుచందూర్ లోని సుబ్రహ్మణ్యస్వామివారి విగ్రహం
కూర్చుని ఉన్నట్టు ఉండడం ఆశ్చర్యకరం.
కుంభకోణం
స్వామి మలై
అని పిలిచే ఈ క్షేత్రంకు అత్యంత విశిష్టత ఉంది. తన తండ్రి అయిన పరమశివునికి
సుబ్రమణ్యస్వామి జ్ఞానోపదేశము చేసిన ప్రదేశంగా ఈ స్వామిమలైని పేర్కొంటారు.
పళని
ఆంద్రప్రదేశ్ లోని తిరుమల క్షేత్రానికి ఎంతటి ప్రసిద్ధి వుందో తమిళనాడులో
పళవి క్షేత్రానికి అంతటి ప్రసిద్ధి ఉంది. తిరుమల తరహాలోనే పళవిలోనూ నిత్యం
భక్తులు కిటకిటలాడుతుంటారు. కొండపై వెలసిన స్వామివారిని దర్శించుకోవాలంటే
దాదాపు వెయ్యి మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.
తిరుత్తణి
తిరుపతి
నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ క్షేత్రంలోనూ విశేషమైన
దినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. తన భార్యల్లో ఒకరైన వల్లిని
సుబ్రమణ్యస్వామి తిరుత్తణిలోనే పెళ్లాడినట్టు పురాణాలు చెబుతున్నాయి.
పరిముదిర్ చోళై
దట్టమైన అడవి ప్రాంతంలో వెలసిన ఈ క్షేత్రం కూడా సుబ్రమణ్యస్వామి దివ్య
క్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. పైన పేర్కొన్న క్షేత్రాలే కాకుండా
తమిళనాడులోని చాలా ప్రదేశాల్లో సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి.
తిరువరన్ కున్రమ్
తమిళనాడులో ప్రసిద్ధి చెందిన కామాక్షి అమ్మవారు కొలువైన మధురైకు సమీపంలోనే
ఈ తిరుపరన్ కున్రమ్ క్షేత్రం కూడా కొలువై ఉంది. తన ఇద్దరూ భార్యలలో ఒకరైన
దేవసేనను సుబ్రమణ్యస్వామి వివాహం చేసుకున్న ప్రదేశమే తిరుపరన్ కున్రమ్.
Showing posts with label Subramanyam. Show all posts
Showing posts with label Subramanyam. Show all posts
Thursday, June 20, 2013
శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రమ్
ఆదిత్య విష్ణువిఘ్నేశ రుద్ర బ్రహ్మ మరుదణా:
లోకపాలా స్సర్వదేవా శ్చరాచర మిదం జగత్
సర్వం త్వమేవ బ్రహ్మైవ అహమక్షర మద్యయమ్
అప్రమేయం మహాశంత మచలం నిర్వికారకమ్
నిరాలంబం నిరాభాసం సత్తామత్రమగోచరమ్
ఏవం త్వాం మేధయా బుద్ధ్యా సదా పశృంతి సూరయ:
ఎవమజ్ఞాన గాడాంధతమొపహత చేతన:
సపశ్యంతి తథా ముధా: సదా దుర్గతి హేతవే.
విష్ట్యాదీని స్వరూపాణి లిలాలోక విడంబనమ్
కర్తుముద్యమ్య రూపాణి వివిధాని భవంతి చ
తత్తదుక్తా: కథా స్సమ్యక్ నిత్యసద్గతి ప్రాప్తయే
భక్త్యా శ్రుత్వా పఠిత్వా చ దృష్ట్యా సంపూజ్య శ్రద్ధయా
సర్వాన్యామానవాప్నోతి భవదారాధనాత్ఖలు
మమ పూజా మనుగ్రాహ్య సుప్రసీద భవానఘ
చపలం మన్మథ వశమమర్యాదమాసూయకమ్
పంచకం దుఖజనకం పాపిష్టం పాహి మాం ప్రభో
సుబ్రహ్మణ్య స్తోత్ర మిదం యే పఠంతి ద్విజోత్తమాః
తే సర్వే ముక్తిమాయాంతి సుబ్రహ్మణ్య ప్రదాదతః
ఇతి శ్రీ సుబ్రహ్మణ్యస్తోత్రమ్
ఆదిత్య విష్ణువిఘ్నేశ రుద్ర బ్రహ్మ మరుదణా:
లోకపాలా స్సర్వదేవా శ్చరాచర మిదం జగత్
సర్వం త్వమేవ బ్రహ్మైవ అహమక్షర మద్యయమ్
అప్రమేయం మహాశంత మచలం నిర్వికారకమ్
నిరాలంబం నిరాభాసం సత్తామత్రమగోచరమ్
ఏవం త్వాం మేధయా బుద్ధ్యా సదా పశృంతి సూరయ:
ఎవమజ్ఞాన గాడాంధతమొపహత చేతన:
సపశ్యంతి తథా ముధా: సదా దుర్గతి హేతవే.
విష్ట్యాదీని స్వరూపాణి లిలాలోక విడంబనమ్
కర్తుముద్యమ్య రూపాణి వివిధాని భవంతి చ
తత్తదుక్తా: కథా స్సమ్యక్ నిత్యసద్గతి ప్రాప్తయే
భక్త్యా శ్రుత్వా పఠిత్వా చ దృష్ట్యా సంపూజ్య శ్రద్ధయా
సర్వాన్యామానవాప్నోతి భవదారాధనాత్ఖలు
మమ పూజా మనుగ్రాహ్య సుప్రసీద భవానఘ
చపలం మన్మథ వశమమర్యాదమాసూయకమ్
పంచకం దుఖజనకం పాపిష్టం పాహి మాం ప్రభో
సుబ్రహ్మణ్య స్తోత్ర మిదం యే పఠంతి ద్విజోత్తమాః
తే సర్వే ముక్తిమాయాంతి సుబ్రహ్మణ్య ప్రదాదతః
ఇతి శ్రీ సుబ్రహ్మణ్యస్తోత్రమ్
Subscribe to:
Posts (Atom)