చేతులారంగ శివునిఁ బూజింపఁడేని
నోరునొవ్వంగ హరికీర్తినుడువఁడేని
దయయు సత్యంబులోనుగాఁ దలఁపడేని
గలుగనేటికిఁ దల్లుల కడుపుచేటు.
’చేతులారంగ’ అంటే చేతులనిండుగా తృప్తితో శివపూజ చేయనివాడూ, ’నోరునొవ్వంగ’
అంటే ఎల్లప్పుడూ హరినామ, గుణకీర్తనం చేయనివాడూ, సత్యమూ, దయా మొదలైన మంచి
గుణాలను గూర్చి ఆలోచించనివాడూ పుట్టడం కూడా వ్యర్థమే. వాడి జన్మ తల్లికడుపు
పంటగా కాకుండా, తల్లికడుపు మంటగా నిలుస్తుంది అంటూ కొంత ఘాటుగానే
మందలించినారు పోతన.
నోరునొవ్వంగ హరికీర్తినుడువఁడేని
దయయు సత్యంబులోనుగాఁ దలఁపడేని
గలుగనేటికిఁ దల్లుల కడుపుచేటు.
’చేతులారంగ’ అంటే చేతులనిండుగా తృప్తితో శివపూజ చేయనివాడూ, ’నోరునొవ్వంగ’ అంటే ఎల్లప్పుడూ హరినామ, గుణకీర్తనం చేయనివాడూ, సత్యమూ, దయా మొదలైన మంచి గుణాలను గూర్చి ఆలోచించనివాడూ పుట్టడం కూడా వ్యర్థమే. వాడి జన్మ తల్లికడుపు పంటగా కాకుండా, తల్లికడుపు మంటగా నిలుస్తుంది అంటూ కొంత ఘాటుగానే మందలించినారు పోతన.

No comments:
Post a Comment