అలిపిరి దగ్గర శ్రీవారి పాదాలు ఎలా వచ్చాయి?
తిరుమల నంబి స్వామి వారికి అభిషేకం చేసి, కిందకి దిగి రోజూ రామానుజా
చార్యుల వారికి రామాయణం చెప్పేవారు. మళ్లి సాయంత్రం కొండ ఎక్కేవారు. దీని
వల్ల స్వామి వారి దర్శనం ప్రొద్దున్న & సాయంత్రం మాత్రమే అవుతోందని
బాధ పడేవారు. వేంకటేశ్వర స్వామి వారు ఆయన కలలో కనబడి ఏమని అభయం ఇచ్చారంటే -
నా పాదాలని అలిపిరి దగ్గర ఉంచుతాను నువ్వు మధ్యాహ్నం కూడా వచ్చి దర్సనం
చేసుకోవచ్చు అని. మనం కొండని కాలి మార్గం గుండా వెళ్ళే ముందు అలిపిరిలో
శ్రీవారి పాదములు అని కనిపిస్తాయి. ఆ పాదాలు తిరుమల నంబి గొప్పతనం వల్లనే
వచ్చాయి. ఎంతో గొప్ప మహానుభావుడాయన.
No comments:
Post a Comment