వట సావిత్రీ వ్రతం
ఈ వ్రతము సుమంగళి స్త్రీలకు చాల ఉత్తమమైన వ్రతము. బీదైన సంపన్నురాలైన
వివాహిత కోరుకొనేది తన భర్త అయురరోగ్యములతో వర్దిల్లలనేది మొదటిది. ఈ
వ్రతమును సావిత్రి అనుష్టించి తన భర్త సత్యవంతుని యమధర్మరాజుతో పోరాడి
జీవిమ్పచేసుకున్న వ్రత విధానం.
జ్యేష్ట మాస పౌర్ణమి నాడు అనగా
23-06-2013 అనుష్టించ వలెను. ఈ రోజు ప్రొద్దుననే తలకు స్నానము చేసి మీ
గృహమునకు దగ్గరగా వుండే దేవాలయములో మఱ్ఱి చెట్టుకు ఒక కుండ నీళ్ళు వేరు దగ్గర పోసి మఱ్ఱి చెట్టును మూడు సార్లు ప్రదక్షిణము చేసి నమస్కరించ వలెను.
అప్పుడు చెప్ప వలసిన శ్లోకం:
వట మూలే స్తితో బ్రంహ వట మధ్యే జనార్దనః వటాగ్రే తు శివం విద్యాత్ సావిత్రివ్రత సమ్యుత వట సిన్చామితే మూలం సలిలైహి రంరుతోపయైహి ||
ఈ విధముగా మఱ్ఱి చెట్టుకు నీరు పోసి ప్రదక్షణము చేస్తే మీ భర్త
అయురరోగ్యములతో వుండి మీకు దీర్ఘ సౌమంగల్యము కలిగేటట్టు అశీర్వాదము
లభిన్చును.
మీ గృహములో దేవుని సన్నిధిలో చెప్పుకోవలసిన సంకల్పము
మమ జన్మ జన్మని అవైధవ్యప్రాప్త్యే భర్తుహు చిరాయు రారోగ్య సంపదాది
ప్రాప్తి కామనయ సావిత్రి వ్రతం కరిష్యే తర్వాత కలశము స్తాపించి
ప్రాణప్రతిష్ఠ వరకు చేసి
అస్మిన్ చిత్ర కలశే వట వృక్షం బ్రమ్హానం
సావిత్రిం సత్యవంతం ధర్మరాజం నారదంచ ఆవాహయామి షోడశోపచార పూజలు చేసి కింద
చెప్పిన శ్లోకములతో అర్ఘ్యము ఇవ్వవలెను
౧ ఓంకార పూర్వికే దేవి వీణా పుస్తక ధారిణి వేదమాత నమస్తుభ్యం సౌభాగ్యంచ ప్రయచ్చమే
౨ ఓంకార పూర్వికే దేవి సర్వ దుక్ఖ నివారిణి, వేదమాతర్నమస్తుభ్యం అవైదవ్యం ప్రయచ్చమే
౩ పతివ్రతే మహాభాగే వన్హియానే సూచి స్మితే ద్రుడవ్రతే ద్రుడమతే భర్తుస్చ ప్రియవాడిని
౪ అవైధవ్యం చ సౌభాఘ్యం దేహిత్వం మామ సువాతే పుత్రాన్ పౌత్రామ్స్చ సౌక్యంస్చ గృహాణార్ఘ్యం నమోస్తుతే
౫ త్వయా సృష్టం జగత్సర్వం సదేవాసుర మానవం సత్యవ్రతధరో దేవా బ్రమ్హరూప నమోస్తుతే
౬ త్వం కర్మసాక్షి లోకానాం శుభాశుభ విశేషకః గృహాణార్ఘ్యం ధర్మరాజ వైవస్వత నమోస్తుతే
౭ అవియోగ యథా దేవా సావిత్ర్యా సహితస్య చ అవియోగాస్థథాస్మాకం భూయాత్ జన్మని జన్మని
తర్వాత ఒక కొత్త వెదురు చాటకు పసుపు పూసి కుంకుమ పెట్టి అందులో సౌభాగ్య
ద్రవ్యములు పసుపు కుంకుమ గాజులు దువ్వెన అద్దం కాటుక సక్త్యానుసారం చీర
లేకుంటే రవిక బట్ట తాంబూలం పెట్టి వయోవ్రుద్దురాలైన సుమంగలిని ఆహ్వానించి
కాళ్ళకు పసుపు పూసి కుంకుమ పెట్టి వాయనము ఇచ్చి అక్షతలు ఆవిడకు ఇచ్చి దీర్ఘ
సుమంగళిగా అస్సేర్వదించమని ప్రార్తించాలి
దీనివల్ల భర్తకు ఎటువంటి అపమృత్యు దోషములు వున్నాను అవి తొలగి మీరు దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతారు
No comments:
Post a Comment