Monday, June 24, 2013

వృత్రాసురుడిని చంపి ఇంద్రుడు బ్రహ్మహత్యాపాపము మూటగట్టుకొనెను.
ఆ దోషము పోగొట్టుకొనుటకు ఇంద్రుడు ఐదు వైష్ణవాలయాలు స్థాపించాడు.

కాశీ లో బిందు మాధవ స్వామి.
ప్రయాగ లో వేణు మాధవ స్వామి.
పిఠాపురంలో కుంతి మాధవ స్వామి.
తిరుచునాపల్లి లో సుందర మాధవ స్వామి.
రామేశ్వరం లో సేతు మాధవ స్వామి.
తిరుమల 7 కొండలు..

1. వృషాద్రి 2. వృషభాద్రి 3. గరుడాద్రి 4. అంజనాద్రి 5. శేషాద్రి 6. వేంకటాద్రి 7. నారాయణాద్రి.

ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది. బ్రహ్మ స్థానం లో ఉంటుంది.

అందుకనే ఆయన 7 కొండలు పైన ఉంటాడు. ఈ 7 కొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది. ఆ 7 కొండలు సాలగ్రామాలే. ఆ 7 కొండలూ మహర్షులే. అక్కడి చెట్లు, పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు.

1. వృషభాద్రి - అంటే ఎద్దు. వ్రుశాభానికి ఋగ్వేదం లో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమ శివుడు కూర్చుంటాడు. దానికి 4 కొమ్ములున్టాయ్. 3 పాదాలు (భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు)

వాక్కు అంటే - శబ్దం
శబ్దం అంటే - వేదం
వేదం అంటే - ప్రమాణము

నా కంటితో చూసిందే నిజమంటే కుదరదు. నిజం కానివి చాలా ఉంటాయ్. సుర్యోదయం, సూర్యాస్తమయం అని అంటున్నారు. నిజం గా దాని కన్నా అభద్దం ఉంకోటి లేదు. సూర్యుడికి కదలిక ఏమి ఉండదు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. భూమి తిరగడం మీరు చూసారా. భూమి సూర్యుడికి అభిముఖంగా వెళ్ళినప్పుడు చీకటి. తిరగనది సూర్యుడు. మీ కన్ను భ్రమకి లోనైట్ట లేదా. కాబట్టి వేదమే ప్రమాణము. వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు.

2. వృషాద్రి - అంటే ధర్మం

ధర్మం అంటే - నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, చూడడం, మంచి వాక్కు etc. దాని వల్ల ఇహం లోను, పరలోకం లోను సుఖాన్ని పొందుతాడు.

అవి చెయ్యడమే వృషాద్రి ని ఎక్కడం.

3. గరుడాద్రి - అంటే పక్షి - ఉపనిషత్తుల జ్ఞా నాన్ని పొందడం.
షడ్ - అంటే జీర్ణం కానిది. ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణం కానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటికి 6 వికారాలు ఉంటాయి.

పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది.

ఇవ్వన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ 6 లేని వాడు భగవానుడు.

భ == ఐశ్వర్య బలము, వీర్య తేజస్సు & అంతా తానే బ్రహ్మాండము అయినవాడు.
అన్ == ఉన్నవాడు, కళ్యాణ గుణ సహితుడు, హేయగుణ రహితుడు.

అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి.

4. అంజనాద్రి - అంజనం అంటే కంటికి కాటుక.
కాటుక ఎప్పుడు పెట్టుకుంటాం? అందానికి, చలవకి.

కంటికి అందం ఎప్పుడు? - ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినపుడు. ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా పరమాత్మ సృష్టియే.

అప్పుడు అంజనాద్రి దాటతాడు.

5. శేషాద్రి - ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూసాడనుకోండి వాడికి రాగ ద్వేషాలు ఉండవు. వాడికి క్రోధం ఉండదు. వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీత లో గీత చార్యుడు చెప్పాడు,

తుల్య నిందా స్తుతిర్ మౌని (శ్లోకం చెప్పారు)

తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాడికి భయం. అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు. (ఇక్కడ రమణ మహర్షి కొన్ని ఉదాహరణలు గురుంచి చెప్పారు ) ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం.

6. వేంకటాద్రి - వేం : పాపం, కట : తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు, అందుకనే మనకి బ్రహ్మం తెలిసిన వారు పిచ్చి వాళ్ళలా కనవడుతారు అది మన కర్మ. రామ కృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని, పిచ్చి వాడు ఒకలా ఉంటారు.

ఆయనకే అర్పణం అనడం & అటువంటి స్థితి ని పొందడం వెంకటాద్రి ఎక్కడం.

7. నారాయణాద్రి - అంటే తుల్యావస్థ ని కూడా దాటిపోయి, తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారయానాద్రి.

వేంకటాచలం లో 7 కొండలు ఎక్కడం వెనకాల ఇంత నిక్షేపాలను ఉంచారు. ఈ కారణాలు తెలుకుకోవడం 7 కొండలు ఎక్కడం.
శ్రీశైలపూర్నులు అని పిలవబడే తిరుమల నంబి .

ఎంత గొప్ప వారు అంటే, ప్రాచీన కాలం లో స్వామి వారి అభిషేకానికి నీళ్ళు తెచ్చేవాళ్ళు లేనప్పుడు ఆయన మడి కట్టుకుని బ్రాహ్మీ ముహూర్తం లో, కారు చీకటి లో స్వామి వారికి పాప నాశనం నుంచి కుండలో నీళ్ళు తెచ్చేవారు. ఒక రోజు స్వామి వారు ఆయన భక్తిని పరీక్షిద్దామని, అలాగే లోకానికి చాటి చెప్పాలని, ఒక బోయ వాడి రూపంలో వచ్చి తాత తాత దాహం వేస్తోంది కొన్ని నీళ్ళు ఇవ్వా అని అడిగారు. ఈ నీళ్ళు స్వామి వారి అభిషేకానికి పట్టికెళ్ళు తున్నాను, నీకు ఇవ్వను పో అన్నాడు. అప్పుడు ఆ బోయవాడు తిరుమల నంబి వెనక్కి వెళ్లి, బాణంతో కుండని కొట్టాడు. కుండకి చిల్లు పడింది, నీళ్ళు అంతా తాగేసాడు. ఆయన ఎంత పనిచేసావు రా శ్రీనివాసుడికి పట్టికెళ్ళే నీళ్ళని తాగేసావా అని చాల బాధ పడ్డారు. తిరుమల నంది ఆ బోయ పిల్ల వాడిని నిందించబోతోంటే, తాత తాత ఏమి బాధ పడకు అని, నీకు పాప నాశనం కంటే గొప్ప నీరుని చూపిస్తాను. ఇక్కడే ఉంది అని ఒక కొండ గుహ లోకి తీసుకువెళ్ళాడు. అక్కడ బాణ ప్రయోగం చేస్తే ఆకాశ గంగ పుట్టింది. ఇక నుంచి ఈ నీటితో నాకు అభిషేకం చెయ్యి అని అన్నాడు. తిరుమల నంబి ఆశ్చర్యపోయి వెనక్కి చూసేసరికి, ఆ పిల్ల వాడు మాయమైపోయాడు. కాబడి, ప్రతి శుక్రవారం నాడు ఆకాశ గంగ నుంచి తీర్థాన్ని తీసుకెళ్ళి స్వామి వారికి అభిషేకం చేస్తారు. స్వామి వారిచే తాత తాత అని పిలిపించు కున్నాడు కాబట్టి మొదటి నీరాజనం తిరుమల నమ్బికే. స్వామి వారిని మాడ వీధులలో ఊరేగింపుకి తీసుకుని వెళ్ళేటపుడు, స్వామి మొదటి నీరాజనం తిరుమల నంబి దేవాలయం దగ్గరే తీసుకుంటారు. ఈ గుడి సహస్ర దీపాలంకరణ చేసే రోడ్డులో దక్షిణం వైపు ఉంది
అలిపిరి దగ్గర శ్రీవారి పాదాలు ఎలా వచ్చాయి?

తిరుమల నంబి స్వామి వారికి అభిషేకం చేసి, కిందకి దిగి రోజూ రామానుజా చార్యుల వారికి రామాయణం చెప్పేవారు. మళ్లి సాయంత్రం కొండ ఎక్కేవారు. దీని వల్ల స్వామి వారి దర్శనం ప్రొద్దున్న & సాయంత్రం మాత్రమే అవుతోందని బాధ పడేవారు. వేంకటేశ్వర స్వామి వారు ఆయన కలలో కనబడి ఏమని అభయం ఇచ్చారంటే - నా పాదాలని అలిపిరి దగ్గర ఉంచుతాను నువ్వు మధ్యాహ్నం కూడా వచ్చి దర్సనం చేసుకోవచ్చు అని. మనం కొండని కాలి మార్గం గుండా వెళ్ళే ముందు అలిపిరిలో శ్రీవారి పాదములు అని కనిపిస్తాయి. ఆ పాదాలు తిరుమల నంబి గొప్పతనం వల్లనే వచ్చాయి. ఎంతో గొప్ప మహానుభావుడాయన.

వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం కుండలోనే..

ఈశ్వరుడు అంటాడుట "నేను చెప్పినట్టు మీరు నడుచుకోవడమే మీరు నాకు ఇచ్చే పెద్ద దక్షిణ. భగవంతుడు బంగారానికి,వజ్రాలకి పొంగిపోయే ఆయన కాదని చెబుతూ గురువు గారు ఈ కధ చెప్పారు. ఇది వరకు తిరుమలలో "తొండమాన్ చక్రవర్తి" అనే ఆయన స్వామి వారికి రోజూ బంగారు తులసి దళాలు సమర్పించేవాడట. అప్పట్లో స్వామి వారు భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు కూడా. ఈ తొండమాన్ చక్రవర్తి రోజూ స్వామి వారి దగ్గరికి వెళ్లి చెబుతూ ఉండేవాడుట - స్వామి నేను మీకు రోజూ బంగారు తులసీదళాలతో పూజ చేస్తున్నాను. పైగా, నాకంటే పెద్ద భక్తుడు మీకు ఎవరున్నారు స్వామి అన్నాడుట. స్వామి వారికి చిరాకు వేసి వీడికి ఒక పాఠం చెప్పాలని, నాకు ప్రియమైన భక్తుడు ఈ ప్రాంతానికి దగ్గర లోనే భీముడు అని ఒక కుమ్మరివాడు ఉంటాడు. వాడిని వెళ్లి చూడు అన్నారుట స్వామి. మరుసటి రోజు వెళదాం అని అనుకుని, స్వామి వారి పాదాల క్రింద ఉన్న తులసి దళాలని శుభ్రం చేస్తున్నాడుట. అప్పుడు, తను చేయించిన బంగారు తులసి దళాల క్రింద, మట్టి తులసిదళాలు కనిపించాయుట. స్వామి వారు చెప్పారుట ఈ మట్టి దళాలు, ఆ భీముడే సమర్పించాడు నాకు అని. అప్పుడు మనసులో అనుకున్నాడుట, మట్టి తులసి దళాలు స్వామికి నచ్చాయా, వీడు ఎవరో కాని వెంటనే వెళ్లి కలవాలని బయలుదేరాడుట. ఆ రోజు చాల ఎండగా ఉంది, అప్పటికే నడిచి నడిచి, భీముడి ఇంటి దగ్గరలో స్పృహ తప్పి పడిపోయాడుట. అప్పుడు ఆ భీముడే,తొండమాన్ చక్రవర్తి ని లేవదీసి తన ఇంటికి తీసుకువెల్లాడుట. తొండమాన్ చక్రవర్తి అడిగాడుట, ఒరేయ్ నువ్వు ఏమి చేస్తూ ఉంటావు? వేంకటేశ్వర స్వామి వారికి నువ్వంటే చాల ఇష్టం.

భీముడు అన్నాడు, నేనేం చేస్తాను స్వామి
- కుండ చేసేముందు ఈశ్వరా నన్ను అనుగ్రహించావు.
- కుండలు చేసుకునే శక్తి ని ఇచ్చావు.
- అవి అమ్మితే నాలుగు రూపాయలు వచ్చేట్టు చేసావు
- వాటి వల్ల నా సంసారం సాగుతోంది.
- నీకు కృతజ్ఞతగా ఒక మట్టి తులసి దళం చేసి నీ పాదాల యందు ఉంచుతాను అని అక్కడే ఉన్న కొయ్యతో చేయబడిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూర్తికి సమర్పించేవాడుట. ఏ పని మొదలుపెట్టినా "గోవింద" నేను చేయడమేమిటి? నీవే నాతో చేయించు కుంటున్నావు స్వామి అనేవాడుట?

అప్పుడు తొండమాన్ చక్రవర్తి అనుకున్నారుట,

వీడేమో - అంతా స్వామి వారే చేయిస్తున్నారు అని అనుకుంటున్నాడు,
నేనేమో - నేను చేస్తున్నాను అని సమర్పిస్తున్నాను.

ఇదే మనమందరము చేసే పెద్ద తప్పిదం.

భీముడు అన్నం తినే ముందు మట్టి తో చిన్న మూకుడు చేసి, అందులో అన్నం ముద్ద పెట్టి, స్వామి వారికి సమర్పించి తను తినేవాడుట. స్వామి వారు భీముడి భక్తి కి పొంగిపోయి శ్రీదేవి, భూదేవి సహితుడై, దివ్య విమానం లోంచి దిగి, భీముడి పాక ముందు ప్రత్యక్షమయ్యారుట. వెంటనే స్వామి వారు భీముడిని కౌగలించుకుని, భీముడు తన మీద చూపించే భక్తికి పొంగిపోయి, తన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్ని భీముడి మెడలో వేసారు.
అలాగే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, వారి ఆభరణాలన్నిభీముడి భార్యకి తొడిగారుట. స్వామి వారు గరుత్మంతుడిని పిలిచి ఈ జీవుడిని సశరీరంగా, వైకుంఠానికి తీసుకువెళ్ళమని ఆదేశించారు. ఇప్పటికి స్వామి వారి ఆనంద నిలయంలో మొదటి గడప దాటి పెట్టే నైవేద్యం కుండతో చేసిన పెరుగు అన్నం. ప్రతి రోజూ ఒక కొత్త కుండ చేసి అందులోనే నైవేద్యం పెడతారు. అదొక్కటే తింటారు స్వామి వారు.

సారాంశం:

ఎక్కడ భక్తి ఉందో అక్కడ వశుడై పోతాడు స్వామి.
ఎక్కడ గర్వం/అహంకారం ఉన్నాయో అక్కడ ఆయన ఉండరు.

సమస్త అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడాయన. ఈశ్వరా ఇదంతా
నీ సృష్టే తండ్రి, నేను నీకు ఏమైనా ఇవ్వగాలనా అని అనుకోవాలుట.
వట సావిత్రీ వ్రతం

ఈ వ్రతము సుమంగళి స్త్రీలకు చాల ఉత్తమమైన వ్రతము. బీదైన సంపన్నురాలైన వివాహిత కోరుకొనేది తన భర్త అయురరోగ్యములతో వర్దిల్లలనేది మొదటిది. ఈ వ్రతమును సావిత్రి అనుష్టించి తన భర్త సత్యవంతుని యమధర్మరాజుతో పోరాడి జీవిమ్పచేసుకున్న వ్రత విధానం.

జ్యేష్ట మాస పౌర్ణమి నాడు అనగా 23-06-2013 అనుష్టించ వలెను. ఈ రోజు ప్రొద్దుననే తలకు స్నానము చేసి మీ గృహమునకు దగ్గరగా వుండే దేవాలయములో మఱ్ఱి చెట్టుకు ఒక కుండ నీళ్ళు వేరు దగ్గర పోసి మఱ్ఱి చెట్టును మూడు సార్లు ప్రదక్షిణము చేసి నమస్కరించ వలెను.

అప్పుడు చెప్ప వలసిన శ్లోకం:
వట మూలే స్తితో బ్రంహ వట మధ్యే జనార్దనః వటాగ్రే తు శివం విద్యాత్ సావిత్రివ్రత సమ్యుత వట సిన్చామితే మూలం సలిలైహి రంరుతోపయైహి ||

ఈ విధముగా మఱ్ఱి చెట్టుకు నీరు పోసి ప్రదక్షణము చేస్తే మీ భర్త అయురరోగ్యములతో వుండి మీకు దీర్ఘ సౌమంగల్యము కలిగేటట్టు అశీర్వాదము లభిన్చును.

మీ గృహములో దేవుని సన్నిధిలో చెప్పుకోవలసిన సంకల్పము
మమ జన్మ జన్మని అవైధవ్యప్రాప్త్యే భర్తుహు చిరాయు రారోగ్య సంపదాది ప్రాప్తి కామనయ సావిత్రి వ్రతం కరిష్యే తర్వాత కలశము స్తాపించి ప్రాణప్రతిష్ఠ వరకు చేసి
అస్మిన్ చిత్ర కలశే వట వృక్షం బ్రమ్హానం సావిత్రిం సత్యవంతం ధర్మరాజం నారదంచ ఆవాహయామి షోడశోపచార పూజలు చేసి కింద చెప్పిన శ్లోకములతో అర్ఘ్యము ఇవ్వవలెను

౧ ఓంకార పూర్వికే దేవి వీణా పుస్తక ధారిణి వేదమాత నమస్తుభ్యం సౌభాగ్యంచ ప్రయచ్చమే

౨ ఓంకార పూర్వికే దేవి సర్వ దుక్ఖ నివారిణి, వేదమాతర్నమస్తుభ్యం అవైదవ్యం ప్రయచ్చమే

౩ పతివ్రతే మహాభాగే వన్హియానే సూచి స్మితే ద్రుడవ్రతే ద్రుడమతే భర్తుస్చ ప్రియవాడిని

౪ అవైధవ్యం చ సౌభాఘ్యం దేహిత్వం మామ సువాతే పుత్రాన్ పౌత్రామ్స్చ సౌక్యంస్చ గృహాణార్ఘ్యం నమోస్తుతే

౫ త్వయా సృష్టం జగత్సర్వం సదేవాసుర మానవం సత్యవ్రతధరో దేవా బ్రమ్హరూప నమోస్తుతే

౬ త్వం కర్మసాక్షి లోకానాం శుభాశుభ విశేషకః గృహాణార్ఘ్యం ధర్మరాజ వైవస్వత నమోస్తుతే

౭ అవియోగ యథా దేవా సావిత్ర్యా సహితస్య చ అవియోగాస్థథాస్మాకం భూయాత్ జన్మని జన్మని

తర్వాత ఒక కొత్త వెదురు చాటకు పసుపు పూసి కుంకుమ పెట్టి అందులో సౌభాగ్య ద్రవ్యములు పసుపు కుంకుమ గాజులు దువ్వెన అద్దం కాటుక సక్త్యానుసారం చీర లేకుంటే రవిక బట్ట తాంబూలం పెట్టి వయోవ్రుద్దురాలైన సుమంగలిని ఆహ్వానించి కాళ్ళకు పసుపు పూసి కుంకుమ పెట్టి వాయనము ఇచ్చి అక్షతలు ఆవిడకు ఇచ్చి దీర్ఘ సుమంగళిగా అస్సేర్వదించమని ప్రార్తించాలి

దీనివల్ల భర్తకు ఎటువంటి అపమృత్యు దోషములు వున్నాను అవి తొలగి మీరు దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతారు
సూర్యభగవానుడి దివ్య క్షేత్రం కోణార్క్ దేవాలయం

తన కిరణాలతో జగత్తును కాంతిమయం చేసే సూర్యభగవానుడిని పూజించనివారు ఉండరు. కేవలం హిందూమతం ఆచరణలో ఉన్న ప్రాంతాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా సూర్యుని దైవరూపంగా భావించి పూజించేవారున్నారు. అలాంటి సూర్యభగవానుడికోసం నిర్మించబడిన దేవాలయాల్లో దేశంలోనే ప్రసిద్ధి చెందినదిగా కోణార్క్‌లోని సూర్యదేవాలయాన్ని పేర్కొనవచ్చు.

ఒరిస్సాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరి జగన్నాథ ఆలయం నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఈ కోణార్క్ ఆలయం నిర్మించబడి ఉంది. సూర్యుని రథాన్ని పోలిన ఆకారంలో ఈ ఆలయం నిర్మించబడి ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ ఆలయాన్ని ప్రపంచవారసత్వ సంపదగా గుర్తించి యునిసెఫ్ రక్షిస్తోంది.

కోణార్క్ స్థల పురాణం
పురాణ కాలంలో శాపగ్రస్తుడై కుష్టురోగం బారినపడ్డ శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు కోణార్క్ దేవాలయానికి దగ్గర్లో ఉన్న చంద్రభాగ తీర్ధం వద్ద కూర్చుని సూర్యుని స్మరిస్తూ తపస్సు చేశాడు. ఆసమయంలో చంద్రభాగ తీర్థంలో స్నానం చేస్తుండగా అతనికి సూర్యభగవానుడి విగ్రహం లభించింది. దాన్ని సాంబుడు కోణార్క్ ఆలయం ఉన్న ప్రదేశంలో ప్రతిష్టించాడు.
అయితే ప్రస్తుతమున్న ఆలయంలో పురాణకాలంలో స్థాపించబడ్డ విగ్రహం కన్పించదు. ఆ విగ్రహం ఏమైంది అన్న విషయం ఇప్పటికీ రహస్యమే. ప్రస్తుతం కోణార్క్‌లో ఉన్న ఆలయాన్ని గంగ వంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు నిర్మించినట్టుగా చెబుతారు. ఆరోజుల్లో దాదాపు 12 వందల మంది శిల్పులు పన్నెండేళ్ల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు.

కోణార్క్ ఆలయ విశేషాలు
సూర్యుని రథం ఆకారంలో నిర్మించబడిన ఈ దేవాలయానికి ఇరువైపులా పన్నెండు జతల చక్రాలు చెక్కబడి ఉన్నాయి. అలాగే వారంలోని ఏడురోజులను సూచించే విధంగా ఏడుగురర్రాలు చెక్కబడి ఉంటాయి. ఈ చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా స్థానికులు ఖచ్చితమైన సమయాన్ని చెప్పగలరు.

సూర్య పరిభ్రమణాన్ని చూపించే విధంగా ఈ చక్రాలు చెక్కబడడం ఓ గొప్ప విశేషం. అలాగే ఈ దేవాలయంపై అనేక శృంగారభరిత శిల్పాలు సైతం చెక్కబడి ఉన్నాయి. కోణార్క్ ఆలయంలో మూల విరాట్టు లేకపోవడం కూడా ఓ చెప్పుకోదగ్గ విషయమే. అయితే ప్రతి ఏడాది ఇక్కడ రధసప్తమి సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు.

కోణార్క్‌లో సూర్యుని దేవాలయంతో పాటు అఖండాలేశ్వర దేవాలయం, అమరేశ్వర ఆలయం, దుర్గ, గంగేశ్వరీ, కెండూలీ, లక్ష్మీ నారాయణ, మంగళ, నీల మాధవ ఆలయాలు కూడా ఉన్నాయి.

ఈ సమయంలో భక్తులు దేవాలయానికి దగ్గర్లో ఉన్న చంద్రభాగ తీర్థంలో స్నానం చేసి దేవాలయంలో ఉన్న నవగ్రహాలను పూజిస్తారు. అద్భుతమైన శిల్పకళకు, ఆధునిక పరిజ్ఞానికి గుర్తుగా కోణార్క్ దేవాలయాన్ని పేర్కొనవచ్
సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః
భవే భవే నాతిభవే భవస్వ మామ్|భవోద్భవాయ నమః

వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ-
శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః
కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో
బలప్రమథనాయ నమ-స్సర్వ-భూతదమనాయ
నమో మనోన్మనాయ నమః

అఘోరేభ్యోஉథ ఘోరే”భ్యో ఘోరఘోరతరేభ్యః
సర్వేభ్య-స్సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరోపేభ్యః

త్ర్యంబకం యజామహే సుగంథిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్-మృత్యోర్-ముక్షీయ మాஉమృతాత్

తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి
తన్నో రుద్రః ప్రచోదయా”త్

ఓ౦ నమస్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ
మహాదేవాయ త్రయంబకాయ
త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ
నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ
సదాశివాయ శ్రీమన్-మహాదేవాయ నమః

ఓం శంచమే మయశ్చమే ప్రియంచమేను కామశ్చమే
కామశ్చమే సౌమనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే
వస్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిణంచమే
యంతాచమే ధర్తాచమే క్షేమశ్చమే ధృతిశ్చమే
విశ్వంచమే మహశ్చమే సంవిచ్చమే జ్ఞాత్రంచమే
సూశ్చమే ప్రసూశ్చమే సీరంచమే లయశ్చమ
ఋతంచమే உమృతంచమేஉయక్ష్మంచమేஉనామయచ్చమే
జీవాతుశ్చమే దీర్ఘాయుత్వంచమేஉనమిత్రంచమేஉభయంచమే
సుగంచమే శయనంచమే సూషాచమే సుదినంచమే|
సదాశివోమ్ !
సప్తగిరులు

శైలం, శేషశైలం, గరుడాద్రి, వేంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి -- అనేవి. పేర్లు ఏదైనా - ఒకే పర్వత సముదాయం
-- ఇది. యుగాభేదాలతో, వ్యక్తుల పేర్లతో, భక్తుల పేర్లతో, ఈ పర్వతశ్రే ణికి ఏడు పేర్లు ఏర్పడ్డాయి. ఇవేకాక
-- చింతామణి, జ్ఞానాద్రి, ఆనందాద్రి, అంజనాద్రి, నీలాద్రి, వరాహాద్రి, వైకుంఠాద్రి, -- ఇలా
ఎన్నో సార్థకమైన పేర్లున్నాయి. బ్రహ్మాండపురాణం ఈ పర్వతాలకు 20 పేర్లు పేర్కొనింది.

(1) శ్రీశైలం - శ్రీదేవికి నివాసమై -- భక్తులకు సకల సంపదలు ప్రసాదిస్తుంది కనుక.
(2) శేషశైలం - ఆదిశేషుడే పర్వతంగా రూపొందిన పర్వతం.
(3) గరుడాద్రి - వరాహస్వామి ఆజ్ఞపై గరుత్మంతుడు వైకుంఠం నుండి తెచ్చినందున - గరుడాద్రి.
(4) వేంకటాద్రి - వేం = పాపాలను, కటః = దహింప చేసేది. పాప నాశకమైనది.
వేం = అమ్రుతత్వాన్నీ, కటః = ఐశ్వర్యాన్ని ప్రసాదించేది కనుక - వెంకటాచలం.
(5) నారాయణాద్రి = మునుపు 'నారాయణ' అనే బ్రాహ్మణుడు తపస్సు చేసి, విష్ణుదేవున్ని ప్రత్యక్షం చేసుకొని, '
ఈ క్షేత్రం తన పేరుతో ప్రసిద్ది పొందాలని అర్థించాడు. స్వామి అనుగ్రహించాడు. -- అందువల్ల నారాయణాద్రి.
సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నివసించి ఉండే స్థానం కనుకనూ నారాయణాద్రి.
(6) వృషభాద్రి - వృషభుడనే శివభక్తుడు శబర వేషంతో ఉన్న శ్రీనివాసునితో యుద్ధం చేసాడు. స్వామి సుధార్శనాయుధంతో అతన్ని సంహరించాడు. మరణిస్తూ అతడు 'ఈ పర్వతం తన పేరుతో ప్రసిద్ధికి రావాలని' కోరాడు కనుక వృషభాద్రి. మరొకటి వృషభుడనే రాక్షసుడు స్వామివారితో యుద్దంచేసి, చక్రాయుధంతో హతుడై మరణిస్తూ 'ఈ పర్వతం తన పేరుతో ఉందా' లని కోరాడు. కనుక వృషభాద్రి.
(7) వృషాద్రి - వృష మంటే ధర్మం. ధర్మ దేవత తన అభివృద్ధికై ఈ పర్వతం పై తపస్సు చేసినందున -- వృషాద్రి.

సుప్రభాతంలో "శ్రీశేషశైల ..... తవ సుప్రభాతం" శ్లోకం ఈ సప్తగిరులను ప్రస్తుతించింది.
20 నామాలను స్మరించే శ్లోకాలు -- బ్రహ్మాండ పురాణం - శ్రీ వెంకటేశ్వర మాహాత్మ్యం - 1 అధ్యాయం 21 నుంచి 23 శ్లోకాలు.

అంజనాద్రి ర్వ్రుశాద్రిశ్చ శేషాద్రి ర్గరుడాచలః |
తీర్థాద్రిః శ్రీనివాసాద్రి శ్చింతామణిగిరిస్తథా ||
వృషభాద్రి ర్వరాహాద్రిః జ్ణానాద్రిః కనకాచలః |
ఆనందాద్రిశ్చ నీలాద్రి స్సుమేరుశిఖరాచలః ||
వైకుంఠాద్రి: పుష్కరాద్రిః -- ఇతి నామాని వింశతిః

ఈ 20 నామాలు పఠించటంవల్ల సర్వ పాప బంధాలు నుండీ విముక్తులు కాగలరు
రుద్ర కవచము అర్థాలతో
దుర్వాస ఉవాచ:-

శ్లో:-
ప్రణమ్యామి శిరసా దేవం స్వయం భుం పరమేశ్వరం.
ఏకం సర్వ గతం దేవం సర్వ దేవ మయం విభుం.
భావము:-
తనకు తానుగా ఉద్భవించిన వాడును, అంతటను నిండి యున్న యేకైక దైవమును,
సకల దేవతా స్వరూపుడును, అగు పరమేశ్వరునకు శిరసు వంచి నమస్కరింతును.

శ్లో:-
రుద్ర వర్మ ప్రవక్షామి అంగ ప్రాణస్య రక్షయే.
అహో రాత్ర మయం దేవం రక్షార్థం నిర్మితం పురా.
భావము:-
అంగ ప్రాణముల రక్షణ కొఱకు రుద్ర కవచమును - అహో ర్త మయుడైన ఆ దేవ దేవుని చేత రక్షణ కొఱకు అతి పురాతన కాలములోనిర్మింప బడిన రుద్ర కవచమును అంగ ప్రాణ రక్షణ కొఱకు చెప్పు చున్నాను.

శ్లో:-
రుద్రో మే చాగ్రతః పాతు ముఖం పాతు మహేశ్వరః
శిరో మే యీశ్వరః పాతు లలాటం నీలలోహితః
భావము:-
రుద్రుడు ముందు నన్ను రక్షించు గాక. నా ముఖమును మహేశ్వరుడు రక్షించు గాక. నా శిరమును ఈశ్వరుడు రక్షించు గాక. నా లలాటమును నీలలోహితుడు రక్షించు గాక.

శ్లో:-
నేత్రయోస్త్రయంబకః పాతు ముఖం పాతు మహేశ్వరః
కర్ణయోః పాతుమే శంభుర్నాసికాయాం సదాశివః.
భావము:-
నా నేత్రములను త్ర్యంబకుడు రక్షించు గాక. నా ముఖమును మహేశ్వరుడు రక్షించు గాక.
నా చెవులను శంభుడు రక్షించు గాక. నా ముక్కును సదా శివుడు రక్షించు గాక.

శ్లో:-
వాగీశః పాతు మే జిహ్వా మోష్ఠా పాతంబికాపతిః
శ్రీ కంఠః పాతు మే గ్రీవాం బాహూంశ్చైవ పినాక ధృత్.
భావము:-
నా నాలుకను వాగీశుడు రక్షించు గాక. నా పెదవులను అంబికా పతి రక్షించు గాక.
నా కంఠమును శ్రీ కంఠుడు రక్షించు గాక. నా బాహువులను పినాక ధారి రక్షించు గాక.

శ్లో:-
హృదయం మే మహా దేవ ఈశ్వరో వ్యాత్ స్తనాంతరం
నాభిం కటిం స వక్షశ్చ పాతుస్ఛర్వ ఉమాపతిః
భావము:-
నా హృదయమును మహా దేవుడు రక్షించు గాక. నా స్తనాంతరమును ఈశ్వరుడు రక్షించు గాక.
నా నాభిని, కటిని, వాటితో పాటు వక్ష స్తలమును ఉమా పతి రక్షించు గాక.

శ్లో:-
బాహు మధ్యాంతరంచైవ సూక్ష్మ రూపస్సదా శివః
సర్వం రక్షతు సర్వేశో గాత్రానిచ యధా క్రమం
భావము:-
బాహు మధ్యాంతరమును కూడా సూక్ష్మ రూపి యైన సదా శివుడు రక్షించు గాక.
నా శరీరమును యధా క్రమముగా అన్నిటినీ సర్వేశ్వరుడు రక్షించు గాక.

శ్లో:-
వజ్ర శక్తి ధరంచైవ పాశాంకుశధరం తధా.
గండ శూల ధరం నిత్యం రక్షతు త్రి దశేశ్వరః
భావము:-
వజ్ర శక్తిని ధరించిన వాడును, పాశమును అంకుశమును ధరించిన వాడును
గండ శూల ధారియు నగు త్రిదశేశ్వరుడు నన్ను నిత్యము రక్షించు గాక.

శ్లో:-
ప్రస్థానేషు పదే చైవ వృక్షమూలే నదీ తటే
సంధ్యాయాం రాజ భవనే విరూపాక్షస్తు పాతు మాం.
భావము:-
ప్రయాణముల యందును, మార్గముల యందును, వృక్ష మూలమునందు, నదీ తటముల యందు,
సంధ్యా సమయము లందు, రాజ భవనముల యందు, నన్నా విరూపాక్షుడు రక్షించు గాక.

శ్లో:-
శీతోష్ణాదధ కాలేషు తుహిన ధ్రుమ కంటకే
నిర్మానుష్యే సమే మార్గే త్రాహి మాం వృషభ ధ్వజ.
భావము:-
సీతా కాలమునందు, వేసవి కాలము నందు, మంచునందు, వృక్ష కంటకములయందు,
నిర్మానుష్య ప్రదేశములయందు,సమ మార్గమునందు, వృషభ ధ్వజుడు నన్ను రక్షించు గాక.

శ్లో:-
ఇత్యేతద్రుద్ర కవచం పవిత్రం పాప నాశనం
మహాదేవ ప్రసాదేవ దుర్వాసో ముని కల్పితం.
భావము:-
అను యీ విధమైనటువంటి రుద్ర కవచము పవిత్రమైనదియు, పాప నాశనమును కూడ.
ఆ మహా దేవుని ప్రసాదము చేత దుర్వాస మునిచే కల్పింప బడినది.

శ్లో:-
మమాఖ్యాతం సమాసేన స భయం విందతే క్వచిత్.
ప్రాప్నోతి పరమారోగ్యం పుణ్యమాయుష్య వర్ధనం
భావము:-
నా చేత సంక్షిప్తముగా చెప్ప బడిన దీనిని భయ భక్తులతో యెవరు వింటారో
పరమ ఆరోగ్యము పొందుతారు.పుణ్యము, ఆయుర్దాయము, పెరుగును.

శ్లో:-
విద్యార్థీ లభతే విద్యా ధనార్థీ లభతే ధనం.
కన్యార్థీ లభతే కన్యాం స భయం విందతే క్వచిత్.
భావము:-
విద్య కోరు వారికి విద్య లభించును. ధనము నాశించు వారికి ధనము లభించును.
కన్య నాశించు వారికి కన్య లభించును.భయ రహితులై యుందురు.

శ్లో:-
అపుత్రో లభతే పుత్రం మోక్షార్థీ మోక్షమాప్నుయాత్
త్రాహి త్రాహి మహా దేవ త్రాహి త్రాహి త్రయీ మయ.
భావము:-
సంతానము లేని వారికి సంతానము కలుగును. మోక్షము కోరు వారికి మోక్షము లభించును.
రక్షించు మహాదేవా రక్షించు. రక్షించు త్రయీమయా రక్షించు.

శ్లో:-
త్రాహి మాం పార్వతీ నాథ త్రాహి మాం త్రిపురాంతక
పాశం ఖట్వాంగ దివ్యాస్త్రం త్రి శూలం రుద్రమేవచ.
భావము:-
ఓ పార్వతీ పతీ! నన్ను రక్షించుము. ఓ త్రిపురాంతకా! నన్ను రక్షించుము.
పాశము, ఖట్వాంగ దివ్యాస్త్రము, త్రిశూలము ధరించిన రుద్రునకు నమస్కరింతును.

శ్లో:-
నమస్కరోమి దేవేశ త్రాహి మాం జగదీశ్వర
శత్రు మధ్యే సభా మధ్యే గ్రామ మధ్యే గృహాంతరే.
భావము:-
దేవేశా! నమస్కరిస్తున్నాను. ఓ జగదీశ్వరా! శత్రు మధ్యమున, సభా మధ్యమున, గ్రామ మధ్యమున, గృహాంతరమున, నన్ను రక్షించుము.

శ్లో:-
గమనాగమనేచైవ త్రాహి మాం భక్త వత్సల
త్వం చిత్తం త్వం మానసంచ త్వం బుద్ధిస్త్వం పరాయణం.
భావము:-
ఓ భక్త వత్సలా! ప్రయాణ సమయములలో వెళ్ళి వచ్చే సమయములందు నన్ను కాపాడుము.
నీవే చిత్తము, నీవే మనస్సు, నీవే బుద్ధి. సర్వము నిన్నే పరాయణుడిగా కలవాడను.

శ్లో:-
కర్మణా మనసాచైవ త్వం బుద్ధిశ్చ యధా సదా
జ్వర భయం ఛింది సర్వ జ్వర భయం ఛింది గ్రహ భయం.
భావము:-
కర్మ చేత, మనసు చేత, బుద్ధి చేత ఎల్లప్పుడూ నాకు నీవే సుమా.
జ్వరభయము నశించు గాక, సమస్త జ్వర భయము నశించు గాక. గ్రహ భయము నశించు గాక.

శ్లో:-
ఛింది సర్వ శత్రూన్నివత్యాపి సర్వ వ్యాధి నివారణం.
అస్య రుద్ర లోకం గచ్ఛతి శ్రీ రుద్ర లోకం స గచ్ఛతి.
భావము:-
నమస్త శత్రువులను నశింపఁ బడును సమస్త వ్యాధులు నివారింపఁ బడును.
ఇది పఠించిన వారు రుద్రలోకమును చేరుదురు. అట్టి వారు తప్పక రుద్ర లోకమును చేరుదురు.
ఓం నమః ఇతి
స్వస్త్యస్తు.
ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం.

సౌరాష్ట్రదేశే విశదేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకలావతంసం భక్తీ ప్రదానాయ కృపావతీర్థం టం సోమనాథం శరణం ప్రపద్యే శ్రీశైల శృంగే విబూధాతింసంగే తులాద్రితుంగే పి ముదావసంతం త మర్దునం మల్లికా పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం అవంతికాయం విహాతావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యో: పరిరక్షణానార్థం వందే మహాకాల మహాసురేశం కావెరికా నర్మదాయో: పవిత్రే సమాగమే సజ్జనతారణాయ సదైవ మాంధాతృపరే వసంతమోంకార మీశం శివమేకమీడే పూర్వోత్తరే ప్రజ్ఞ్వలైకా నిదానే సదా వసంతం గిరిజాసమేతం సురాసురాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం టం మహం నమామి యామ్యే సదంగే నగరేతి రమ్యే విభూషి తాంగం వివిధైశ్చభోగై: సద్భక్తిముక్తి ప్రదమీశ మేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే మహాద్రిపార్శ్వే చ తటేరమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రై: సురాసురైర్యక్ష మహోరగాద్వై: కేదారమీశం శివమేకమీడే సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరీతీర పవిత్ర దేశే యద్దర్శనా త్పాటకమశునాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే సుతాష్రపర్ణీ జలరాశియోగే నిబధ్యసేతుం విషఖై రాసంఖ్యై: శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి యం ఢాకినీ శాకినికా సమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ సదైవ భీమాది పడ ప్రసిద్ధం తం శంకరం భక్తిహితం నమామి పానంద మానంద వనే వసంత మాననందకందం హతపాపబృందం వారాణసీనాథ మనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ఇలాపురే రమ్యవిశాలకేస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యం వందే మహోదారతర స్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే జ్యోతిర్మయ ద్వాదశాలింగకానం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ స్తోత్రం పఠిత్వామనుజోతి భక్త్యాఫ్లం తదాలోక్య నిజం భాజేచ్ఛ జ్యోతిస్వరూపుడైన మహేశుడు
ఈ పవిత్ర భారతావనిలో పన్నెండుచోట్ల జ్యోతిర్లింగ స్వరూపంలో వెలసి భక్తులను కరుణిస్తున్నాడు. భారతదేశంలోని నాలుగుదిక్కులలో పన్నెండు జ్యోతిర్లింగాలున్నాయి .సముద్రపు ఒడ్డున రెండు (బంగాళాఖాత తీరంలో రామేశ్వరలింగం, అరేబియా సముద్రతీరాన సోమనాథలింగం) పర్వత శిఖరాలలో నాలుగు (శ్రీశైలంలో మల్లిఖార్జునుడు, హిమాలయాలలో కేదారేశ్వరుడు, సహ్యాద్రి పర్వతాలలో భీమశంకరుడు, మేరుపర్వతాలపై వైద్యనాథలింగం) మైదాన ప్రదేశాలలో మూడు (దారుకావనంలో నాగేశ్వరలింగం, ఔరంగాబాద్ వద్ద ఘృష్ణేశ్వర లింగం, ఉజ్జయినీ నగరంలో మహాకాళేశ్వర లింగం) నదుల ఒడ్డున మూడు (గోదావరీతీరాన త్రయంబకేశ్వర లింగం, నర్మదాతీరానా ఓంకారేశ్వరుడు, గంగానదీతీరాన విశ్వేశ్వరుడు), ఇలా మొత్తం పెన్నెండు జ్యోతిర్లింగ రూపాలలోనున్న ఈ లింగాలుపరమశివుని తేజస్సులు. ఇవి ద్వాదశాదిత్యులకు ప్రతీకలు. పదమూడవ లింగం కాలలింగం. తురీయావస్థను పొందిన జీవుటే కాలలింగము.
తైత్తీరీయోపనిషత్తుననుసరించి 1 బ్రహ్మ, 2 మాయ, 3 జీవుడు, 4 మనస్సు, 5 బుద్ధి, 6 చిత్తము, 7 అహంకారము, 8 పృథ్వి, 9 జలము, 10 తేజస్సు, 11 వాయువు, 12 ఆకాశం ... ఈ పన్నెండు తత్త్వాలే పన్నెండు జ్యోతిర్లింగాలు. ఇవన్నీ ప్రతీకాత్మకంగా మన శరీరంలో ఉన్నాయి. ఖాట్మండులోని పశుపతినాథ లింగం ఈ పన్నెండు జ్యోతిర్లింగాలకు శిరస్సు వంటిది. ఈ జ్యోతిర్లింగాలలో ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క మహిమ వుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించినా, స్పృశించినా అనేక మహిమలు మన జీవితాలలో ప్రస్ఫుటమవుతుంటాయి. పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోలేని వారు, కనీసం ఒక్క లింగాన్నైనా దర్శించగలిగితే అనంతకోటి పుణ్యం లభిస్తుందనేది పెద్దల వాక్కు.


 

శ్రీ కృష్ణ శతకం..

హరియను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామమహత్మ్యము
హరి హరి పొగడంగవశమె హరి శ్రీకృష్ణా.ll

భావం:--

అంభుజనాభా ! కృష్ణా ! సమస్తపాపములు పోగొట్టు నీ పేరిటి "హరి" అను రెండక్షరముల మహిమను ఎవరును పొగడజాలరు. నా బోటి వానికి వీలగునా కాదుగదా ????

ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం.

సౌరాష్ట్రదేశే విశదేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకలావతంసం భక్తీ ప్రదానాయ కృపావతీర్థం టం సోమనాథం శరణం ప్రపద్యే శ్రీశైల శృంగే విబూధాతింసంగే తులాద్రితుంగే పి ముదావసంతం త మర్దునం మల్లికా పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం అవంతికాయం విహాతావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యో: పరిరక్షణానార్థం వందే మహాకాల మహాసురేశం కావెరికా నర్మదాయో: పవిత్రే సమాగమే సజ్జనతారణాయ సదైవ మాంధాతృపరే వసంతమోంకార మీశం శివమేకమీడే పూర్వోత్తరే ప్రజ్ఞ్వలైకా నిదానే సదా వసంతం గిరిజాసమేతం సురాసురాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం టం మహం నమామి యామ్యే సదంగే నగరేతి రమ్యే విభూషి తాంగం వివిధైశ్చభోగై: సద్భక్తిముక్తి ప్రదమీశ మేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే మహాద్రిపార్శ్వే చ తటేరమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రై: సురాసురైర్యక్ష మహోరగాద్వై: కేదారమీశం శివమేకమీడే సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరీతీర పవిత్ర దేశే యద్దర్శనా త్పాటకమశునాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే సుతాష్రపర్ణీ జలరాశియోగే నిబధ్యసేతుం విషఖై రాసంఖ్యై: శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి యం ఢాకినీ శాకినికా సమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ సదైవ భీమాది పడ ప్రసిద్ధం తం శంకరం భక్తిహితం నమామి పానంద మానంద వనే వసంత మాననందకందం హతపాపబృందం వారాణసీనాథ మనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ఇలాపురే రమ్యవిశాలకేస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యం వందే మహోదారతర స్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే జ్యోతిర్మయ ద్వాదశాలింగకానం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ స్తోత్రం పఠిత్వామనుజోతి భక్త్యాఫ్లం తదాలోక్య నిజం భాజేచ్ఛ జ్యోతిస్వరూపుడైన మహేశుడు
ఈ పవిత్ర భారతావనిలో పన్నెండుచోట్ల జ్యోతిర్లింగ స్వరూపంలో వెలసి భక్తులను కరుణిస్తున్నాడు. భారతదేశంలోని నాలుగుదిక్కులలో పన్నెండు జ్యోతిర్లింగాలున్నాయి .సముద్రపు ఒడ్డున రెండు (బంగాళాఖాత తీరంలో రామేశ్వరలింగం, అరేబియా సముద్రతీరాన సోమనాథలింగం) పర్వత శిఖరాలలో నాలుగు (శ్రీశైలంలో మల్లిఖార్జునుడు, హిమాలయాలలో కేదారేశ్వరుడు, సహ్యాద్రి పర్వతాలలో భీమశంకరుడు, మేరుపర్వతాలపై వైద్యనాథలింగం) మైదాన ప్రదేశాలలో మూడు (దారుకావనంలో నాగేశ్వరలింగం, ఔరంగాబాద్ వద్ద ఘృష్ణేశ్వర లింగం, ఉజ్జయినీ నగరంలో మహాకాళేశ్వర లింగం) నదుల ఒడ్డున మూడు (గోదావరీతీరాన త్రయంబకేశ్వర లింగం, నర్మదాతీరానా ఓంకారేశ్వరుడు, గంగానదీతీరాన విశ్వేశ్వరుడు), ఇలా మొత్తం పెన్నెండు జ్యోతిర్లింగ రూపాలలోనున్న ఈ లింగాలుపరమశివుని తేజస్సులు. ఇవి ద్వాదశాదిత్యులకు ప్రతీకలు. పదమూడవ లింగం కాలలింగం. తురీయావస్థను పొందిన జీవుటే కాలలింగము.
తైత్తీరీయోపనిషత్తుననుసరించి 1 బ్రహ్మ, 2 మాయ, 3 జీవుడు, 4 మనస్సు, 5 బుద్ధి, 6 చిత్తము, 7 అహంకారము, 8 పృథ్వి, 9 జలము, 10 తేజస్సు, 11 వాయువు, 12 ఆకాశం ... ఈ పన్నెండు తత్త్వాలే పన్నెండు జ్యోతిర్లింగాలు. ఇవన్నీ ప్రతీకాత్మకంగా మన శరీరంలో ఉన్నాయి. ఖాట్మండులోని పశుపతినాథ లింగం ఈ పన్నెండు జ్యోతిర్లింగాలకు శిరస్సు వంటిది. ఈ జ్యోతిర్లింగాలలో ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క మహిమ వుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించినా, స్పృశించినా అనేక మహిమలు మన జీవితాలలో ప్రస్ఫుటమవుతుంటాయి. పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోలేని వారు, కనీసం ఒక్క లింగాన్నైనా దర్శించగలిగితే అనంతకోటి పుణ్యం లభిస్తుందనేది పెద్దల వాక్కు.

Thursday, June 20, 2013

ఉపవాసం ఎందుకు చేయాలి?
భక్తి శ్రద్దలు గల అత్యధిక పక్ష భారతీయులు ఒక క్రమ పద్దతిలో లేదా పండుగల వంటి ప్రత్యెక సందర్భాలలో ఉపవాసాన్ని పాటిస్తారు. అటువంటి రోజుల్లో వాళ్ళు ఏమీ తినకుండా లేక ఒక్కసారి తినడం లేదా పండ్లు లేక అల్పాహారమును ఆహారముగా తీసికొని ఉపవాసము ఉంటారు. కొందరు రోజంతా కనీసం మంచి నీళ్ళు అయినా త్రాగకుండా కఠిన మైన ఉపవాసము చేస్తారు. ఉపవాసం ఎన్నో కారణాల కోసం చేయబడుతుంది. భగవంతుని కోసం లేక సంయమనం కోసం, అసమ్మతిని తెలియ పరచడానికి కూడా ఉపవాసం చేస్తారు. గాంధీ గారు బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా అసమ్మతిని తెలియపరచడానికి ఉపవాసం చేసారు.
ఉపవాసం ఎందుకు చేస్తాము?
ఆహారాన్ని పొదుపు చేయడానికా లేక ఆకలిని బాగా పెంచుకుని విందు ఆరగించాదానికా? నిజానికి అందుకు కాదు. మరి మనమెందుకు ఉపవాసం చేస్తాము?

సంస్కృతంలో ఉప అంటే 'దగ్గరగా' + వాస అంటే 'ఉండడం' అని అర్ధము. కాబట్టి ఉపవాసము అంటే దగ్గరా (ఆ భగవంతుడి) ఉండడం అంటే భగవంతునితో సన్నిహిత మానసిక సామీప్యతను సంపాదించడం. మరి ఉపవాసం - ఆహారముల మధ్య ఏమిటి సంబంధము?

కొన్ని రకాల ఆహారము మన బుద్ధిని మందకొడి గాను మరియు మనసులో అలజడిని కలిగిస్తుంది. అందువలన మానవుడు కొన్ని నియమిత రోజుల్లో నిరాహారముగా లేక అల్పాహారముగా గాని ఉండి తన సమయాన్ని శక్తిని ఆదా చేసికోవాలనుకుంటాడు. తద్వారా బుద్ధి చురుకుగాను మనసు పవిత్రముగాను అవుతుంది. అది వరకు ఆహారపుటాలోచనలు కలిగిన మనస్సు ఇప్పుడు ఉన్నతమైన ఆలోచనలతో కూడి భగవంతుని వద్ద నిలుస్తుంది. తనకు తాను నియమించుకొన్న క్రమశిక్షణ కాబట్టి ఆనందంగా ఆ నియమాన్ని మనస్సు అనుసరించే ఉంటుంది.

ఏ పని తీరుకైనా కూడా అది బాగా పనిచేయాలంటే మరమ్మత్తూ మరియు పూర్తి విరామము అవసరము. ఉపవాసంలో నిరాహారముగా లేక అల్పాహారముగా ఉండుట వలన జీర్ణ మండలానికి విశ్రాంతి లభిస్తుంది.

ఇంద్రియాలతో విషయ భోగాలు అనుభవించే కొద్దీ అవి వశము కాక ఇంకా ఎక్కువ కావలెననును. ఉపవాసము మనకు ఇంద్రియ నిగ్రహము అలవరచుకోవడానికి కోర్కెలను ఉదాత్తమైన వాటిగా చేసికోవడానికి శాంతియుత మనస్సును కల్గి ఉండడానికి మార్గము చూపి సహాయ పడ్తుంది.

ఉపవాసము మనలని నీరస పరిచేదిగాను, తొందరగా కోపం కల్గిన్చేటట్లుగాను మరియు తరువాత అనుభవించ వచ్చుననే ప్రేరణ నిచ్చేదిగాను ఉండకూడదు. ఉపవాసము వెనుక ఉన్నతమైన లక్ష్యము లేనప్పుడు ఇట్లా జరుగుతుంది. కొందరు కేవలము బరువు తగ్గించుకునే నిమిత్తమే ఉపవాసం లేదా పత్యం (diet) పాటిస్తారు. మరి కొందరు భగవంతుని మెప్పించడానికి ప్రతిజ్ఞగా లేదా తమ కోరికలను తీర్చుకొనేందుకు, మరి కొందరు సంకల్ప శక్తి వృద్ధి చేసికోవడానికి, సంయమనానికై, కొందరు ఒక విధమైన తపస్సు గాను ఉపవాసము చేస్తారు. మరీ తక్కువగా కాక ఎక్కువగా కాక యుక్త ఆహారము తీసికోవలసినదని కేవలము ఉపవాసము చేయునప్పుడే కాక మిగతా రోజుల్లో కూడా శుచి ఐన బలవర్ధకమైన సాత్విక ఆహారము తీసికోవలసినదిగా భగవద్గీత మనకు బోధిస్తుంది.
లక్ష్మీదేవి అవరతరణకు సంబంధించిన పురాణాల్లోఅనేక కధలు ఉన్నాయి. వివిధ కల్పాలతో లక్ష్మీదేవి అవతరణకు సంబంధించిన గాథలు వేర్వేరుగా ఉన్నా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న గాథ మాత్రం ఒక్కటే. క్షీరసాగర మధనం సమయంలో లక్ష్మీదేవి ఉద్భవించిన కథ. ఆ కథ ప్రకారం...

ఒకసారి దూర్వాస మహాముని స్వర్గానికి వెళ్లాడు. ఆ సమయంలో ఐరావతం మీద ఇంద్రుడు నందనవనంలో విహరిస్తున్నాడు. దుర్వాస మహాముని రావడాన్ని ఇంద్రుడు గుర్తించలేదు. దీనితో మండిపడిన దుర్వాస మహాముని ''నీకు ఇంద్రపదవి నుండి పతనం ప్రాప్తించుగాక.. నీ సమస్త ఐశ్వర్యం సముద్రంలో కలిసిపోగాక'' - అని శపిస్తాడు.

దుర్వాస మహాముని ఇంద్రుని శపించిన తర్వాత రాక్షసులు స్వర్గంపైకి దండెత్తి స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు దుర్వాస మహాముని శాపం ప్రకారం ఇంద్రుని ఐశ్వర్యమంతా ఆయనకు దూరమవుతుంది. దీనితో ఇంద్రుడు బ్రహ్మ, విష్ణువులకు మొరపెట్టుకోగా, సముద్రాన్ని మధించడమే తరుణోపాయమని చెబుతారు.

ఆ తర్వాత అమృతం కోసం క్షీర సాగరాన్ని మధిస్తున్న సమయంలో కల్పవృక్షం, కామధేనువుతో పాటు లక్ష్మీదేవి ఉద్భవించి, మహా విష్ణువును వరిస్తుంది.

ఇది చాలామందికి తెలిసిస్న గాథ. ఈ కథ కాకుండా భ్రుగుమహర్షి కుమార్తెగా లక్ష్మీదేవి జన్మించినట్లు మరో కధనం కూడా ప్రచారంలో ఉంది. ఆ కథ ప్రకారం....

భ్రుగుమహర్షి భార్య ఖ్యాతి పుత్రికా సంతానం కావాలని ఆశపడింది. ఆ కోరిక నేరవేరేందుకు జగన్మాత అనుగ్రహం కోసం తపస్సు చేస్తుంది. జగన్మాత అనుగ్రహం మేరకు అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవి ఆమెకు కూతురిగా జన్మింస్తుంది. భ్రుగుమహర్షి కుమార్తె కనుక ఆమెను భార్గవిగా పిలుస్తారు. ఇదే కాక వామనావతార గాథలో సైతం లక్ష్మీదేవి జననానికి సంబంధించిన కథ ఉంది.
కాత్యాయని వ్రతాన్ని ఎలా చేయాలి ? ఎందుకు చేయాలి
కాత్యాయని వ్రతాన్ని కన్యలు ఆచరించవచ్చు. వివాహము రద్దైన వారు, పెళ్లికి ఆటంకాలను ఎదుర్కొనే వారు. వివాహము అయి విడాకులు తీసుకున్నవారు, తరచూ వివాహ ప్రయత్నాలు విఫలమైనట్లు అనిపించే వారు ఈ వ్రతాన్ని అనుసరించవచ్చు.

ఇంకా మనసుకు నచ్చే వరుడు కోసం అన్వేషణ చేస్తున్నవారు, కుజదోషము జాతక చక్రములో వున్నవారు, ఆర్థిక స్తోమత లేక వివాహమునకు ఆటంకములు కలవారు ఆచరించవచ్చును. స్త్రీ జాతక చక్రములో రాహుకేతు దోషములు కలవారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు.

వ్రతాన్ని ఎలా ఆచరించాలి.. నియమాలేంటి ?
మంగళవారం రోజున ఈ వ్రతాన్ని ఆరంభించాలి. మంగళవారం కృత్తిక నక్షత్రమైతే ఇంకా మంచిది.
నాగ పంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి,నాగుల చవితి పర్వ దినములలో ఈ వ్రతము ఆచరించవచ్చును.
దేవినవరాత్రులు కూడా ఈ వ్రతము ఆచరించవచ్చును.

బంగారముతో కానీ, పసుపు కొమ్ములతో కానీ వారి శక్తానుసారముగా మంగళ సూత్రములు కలశమునకు అలంకరించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి వండిన అప్పాలను ఏడింటిని నైవేద్యముగా సమర్పించాలి. ఏడు చెరుకు ముక్కలను (తొక్క తీసినవి) కూడా నైవేద్యముగా సమర్పించాలి.

వ్రతము పూర్తీ చేసిన తరువాత వ్రతకథ విని కథాక్షతలను అమ్మవారి మీద వుంచి పిదప ఆ అక్షతలను శిరస్సుపై పెద్దలచే వేయించుకుని ఆశీర్వాదము తీసికుని రాత్రి భోజనము చేయాలి.

మంగళ వారములు భక్తితో జరుపవలెను. మధ్యలో ఏ వారమైన ఆటంకము వచ్చినచో ఆ పై వారము జరుపుకోవచ్చు. ఇలా ఏడు వారాలయ్యాక ఏడో మంగళవారము ఉద్యాపన జరుపుకోవాలి.

ఉద్యాపన రోజున ఏడుగురు ముత్తైదువులను పిలిచి తలంటి పోయాలి. అలా కానీ వారు ఉదయం ముత్తైదువుల గృహమునకు వెళ్లి కుంకుడు కాయలు, పసుపు, తలస్నానమునకు ఇచ్చి రావాలి.

ఉద్యాపన రోజున ఏడుగురు ముత్తైదువులకు ఏడు అప్పాలు, ఏడు చెరుకు ముక్కలు, ఏడు రవికలు వాయనమిచ్చి (ఒక్కరికి చీర ఇచ్చి ) వారిచే అక్షతలు వేయించుకుని ఆశీర్వాదము పొందాలి

ముందుగా పసుపుతో గణపతిని చేసి గణపతికి పూజ చేయాలి. తరువాత పసుపు రాసిన పీటపై బియ్యం పోసి దానిపై కలశమును వుంచి కలశములో పవిత్రమైన నీరుసగము పోయాలి.

అమ్మ వారి విగ్రహము (ఉన్నచో ) లేదా ప్రతిమగా రూపాయి వుంచాలి. ఇంటిలో తూర్పు వైపున ఈశాన్య దిక్కున శుభ్రము చేసి ముగ్గులు వేసి ఎర్ర కండువ పరిచి దాని మీద బియ్యంపోయవలెను.

బియ్యం పైన రాగి చెంబు కానీ , ఇత్తడి చెంబు కానీ ఉంచి టెంకాయను వుంచి దానిపై ఎర్రని రవిక కిరీటంలా పెట్టాలి. (కలశస్థాపన చేయాలి). ఈ వ్రతములో ఎర్రని పువ్వులు ఎర్రని అక్షతలనే వాడటం శ్రేష్ఠం. వ్రతము అయిన తరువాత వండిన భోజన పదార్దములు నైవేద్యం పెట్టాలి. షోడశోపచార పూజ జరుపుకోవాలి. వ్రత మండపములో పార్వతీపరమేశ్వరుల ఫోటో ఖచ్చితముగా ఉండాలి.

సాయం కాలము ఈ వ్రతము ఆచరించవలెను. పగలంతా ఉపవాసము ఉండవలెను. వ్రతము పూర్తి అయిన తరువాత భోజనము చేయాలి. వ్రతం ఆచరించే రోజు శిరస్నానం చేయాలి.

పగలు నిద్రపోరాదు. చివరి వారములో పుణ్య స్త్రీలకు దక్షిణ తాంబూలాదులతో కనీసం 7 కాత్యాయనీ వ్రత పుస్తకములను సమర్పించాలి. ఆర్ధిక స్తోమత లేని వారు వ్రతం ఆచరించలేని వారు ఏడుగురు వివాహం కాని కన్యలకు ఏడు పుస్తకములను ఇచ్చిన చాలా మంచిది...

వందే శివం శంకరమ్

వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిమ్
వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియమ్
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.

వందే సర్వజగద్విహారమతులం వందన్దక ధ్వంసినం
వందే దేవ శిఖామణిం శశినిభం వందే హరే ర్వల్లభమ్
వందే కౄర భుజంగ భూషణధరం వందే శివం చిన్మయం
వందే భక్త జనాశ్రయం చ వరదం వరదం వందే శివం శంకరమ్

వందే దివ్యమచిన్త్య మద్వయ మహం వందేర్క దర్పాపహం
వందే నిర్మల మాదిమూల మనిశం వందే మఖ ద్వంసినమ్
వందే సత్యమనస్త మాధ్యమభయం వందే తిశాన్తాకృతం
వందే భక్త జనాశ్రయం చ వరదం వరదం వందే శివం శంకరమ్

వందే భూరథ మంజుజాక్ష విశిఖం వందే శ్రుతీఘోటాకం
వందే శైల శరాసనం ఫణిగుణం వందే బ్దీ తూణీరకమ్!
వందే పద్మజసారథిం పురహరం వందే మహాభైరవం
వందే భక్త జనాశ్రయం చ వరదం వరదం శివం శంకరమ్

వందే పంచముఖాంబుజం త్రినయం వందే లలాటేక్షణం
వందే వ్యోమగతం జటాసుముకుటం చంద్రార్థ గంగాధరమ్
వందే భస్మకృత త్రిపుండ్ర నిటలం వందేష్టమూర్త్యాత్మకం
వందే భక్త జనాశ్రయం చ వరదం వరదం వందే శివం శంకరమ్

వందే కాలహరం హరం విషధరం వందే మృడం ధూర్జటిం
వందే సర్వగతం దయామృతం నిధిం వందే నృసింహాపహమమ్
వందే విప్రనురార్చితాంఘ్రి కమలం వందే భగాక్షాపహం
వందే భక్త జనాశ్రయం చ వరదం చ వరదం వందే శివం శంకరమ్

వందే మంగళ రాజతాద్రి నిలయం వందే సురాధీశ్వరం
వందే శంకర మప్రమేయ మతులం వందే యమద్వేషిణమ్!
వందే కుండలిరాజ కుండలధరం వందే సహస్రాననం
వందే భక్త జనాశ్రయం చ వరదం చ వరదం వందే శివం శంకరమ్

వందే హంస మతీంద్రఇయం స్మరహరం వందే నిరూపేక్షం
వందే భూత గణేశ మవ్యయ మహం వందేర్థ రాజ్యప్రదమ్
వందే సుందర సౌరభేయ గమనం వందే త్రిశూలధరం
వందే భక్త జనాశ్రయం చ వరదం చ వరదం వందే శివం శంకరమ్

వందే సూక్ష్మమనంత మాద్యమభయం వన్డేనధకారావహం
వందే రావణ నంది భ్రుంగి వినతం వందే సువర్ణావృతమ్!
వందే శైల సుతార్థ భాగవపుషం వందే భయంత్ర్యంబకం
వందే భక్త జనాశ్రయం చ వరదం చ వరదం వందే శివం శంకరమ్.

వందే పావన మంబరాత్మవిభవం వందే మహేన్ద్రశ్వరం
వందే భక్త జనాశ్రయామరతరుం అందే నతాభీష్టదమ్
వందే జహ్నసుతా మ్చికేశ మనిశం వందే త్రిశూలాయుధం
వందే భక్త జనాశ్రయం చ వరదం వరదం వందే శివం శంకరమ్
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాల ప్రాముఖ్యత

శివుని కుమారునిగా పూజలందుకునే సుబ్రహ్మణ్యస్వామికి పురాణాల పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. తండ్రికే జ్ఞానబోధ చేసిన కుమారునిగా సుబ్రమణ్యస్వామి అన్ని దైవాలతో తనకున్న ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆరు ముఖాలతో కూడిన స్వామిగా నిత్యం భక్తుల చేత పూజలందుకునే సుబ్రమణ్యేశ్వరునికి తమిళనాడులోనే అనేక ఆలయాలు అధికంగా ఉండడం విశేషం.

ఆంద్రప్రదేశ్ లో శైవ, వైష్ణవ క్షేత్రాలు అధికంగా ఉన్నట్టుగానే తమిళనాడులో సుబ్రమణ్యేశ్వరుని ఆలయాలు ఎక్కువ సంఖ్యలో కొలువై ఉన్నాయి. ఆరుముఖల స్వామిగా తమిళులకు ప్రీతిపాత్రమైన సుబ్రమణ్యేశ్వరుని ఆరు దివ్య ఆలయాలు కూడా తమిళనాడులోనే ఉన్నాయి. సుబ్రమణ్యేశ్వరుని దివ్య రూపాలను దర్శించాలనుకునే వారు ఈ ఆరు క్షేత్రాలను దర్శిస్తే సరిపోతుంది.

తిరుచందూర్
సముద్రం పక్కనే కొలువైన అతి ప్రాచీన సుబ్రమణ్యేశ్వరుని దేవాలయం తిరుచందూర్ లో ఉంది. సరన్ అనే రాక్షస రాజును సంహరించేందుకోసం స్వామివారు ఈ తిరుచందూర్ లో కొలువై నిలిచారట. తిరుచందూర్ లోని సుబ్రహ్మణ్యస్వామివారి విగ్రహం కూర్చుని ఉన్నట్టు ఉండడం ఆశ్చర్యకరం.

కుంభకోణం
స్వామి మలై అని పిలిచే ఈ క్షేత్రంకు అత్యంత విశిష్టత ఉంది. తన తండ్రి అయిన పరమశివునికి సుబ్రమణ్యస్వామి జ్ఞానోపదేశము చేసిన ప్రదేశంగా ఈ స్వామిమలైని పేర్కొంటారు.

పళని
ఆంద్రప్రదేశ్ లోని తిరుమల క్షేత్రానికి ఎంతటి ప్రసిద్ధి వుందో తమిళనాడులో పళవి క్షేత్రానికి అంతటి ప్రసిద్ధి ఉంది. తిరుమల తరహాలోనే పళవిలోనూ నిత్యం భక్తులు కిటకిటలాడుతుంటారు. కొండపై వెలసిన స్వామివారిని దర్శించుకోవాలంటే దాదాపు వెయ్యి మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.

తిరుత్తణి
తిరుపతి నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ క్షేత్రంలోనూ విశేషమైన దినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. తన భార్యల్లో ఒకరైన వల్లిని సుబ్రమణ్యస్వామి తిరుత్తణిలోనే పెళ్లాడినట్టు పురాణాలు చెబుతున్నాయి.

పరిముదిర్ చోళై
దట్టమైన అడవి ప్రాంతంలో వెలసిన ఈ క్షేత్రం కూడా సుబ్రమణ్యస్వామి దివ్య క్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. పైన పేర్కొన్న క్షేత్రాలే కాకుండా తమిళనాడులోని చాలా ప్రదేశాల్లో సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి.

తిరువరన్ కున్రమ్
తమిళనాడులో ప్రసిద్ధి చెందిన కామాక్షి అమ్మవారు కొలువైన మధురైకు సమీపంలోనే ఈ తిరుపరన్ కున్రమ్ క్షేత్రం కూడా కొలువై ఉంది. తన ఇద్దరూ భార్యలలో ఒకరైన దేవసేనను సుబ్రమణ్యస్వామి వివాహం చేసుకున్న ప్రదేశమే తిరుపరన్ కున్రమ్.
భయాందోళనలను రూపుమాపే శ్వేతార్క ఆంజనేయ స్వామి

తెల్ల జిల్లేడు మొక్క కాండం మీద ఆంజనేయ రూపాన్ని చెక్కి శ్వేతార్క ఆంజనేయ స్వామిని రూపొందిస్తారు. శ్వేతార్క ఆంజనేయ స్వామిని చెక్కేవారు ఆ సమయంలో నియమనిష్టలతో ఉండాలి. స్వామివారికి ఇష్టమైన కాషాయరంగు దుస్తులు ధరించాలి. బ్రహ్మచర్యం పాటించాలి.

శ్వేతార్క ఆంజనేయ స్వామిని ''హనుమజ్జయంతి'' నాడు పూజించడం శ్రేష్టం. లేదా అక్షయతృతీయ నాడు శ్వేతార్క ఆంజనేయ స్వామి పూజ జరుపుకోవడం ఉత్తమం. ఈ రోజుల్లో వీలు కుదరకపోతే, మంగళవారం లేదా శనివారం నాడు ప్రార్ధించవచ్చు. ఆవేళ దశమి తిధి గనుక కలసివస్తే మరీ మంచిది.

ఇంతకీ శ్వేతార్క ఆంజనేయ స్వామి ప్రత్యేకత ఏమిటి అనే సందేహం రావడం సహజం. దుష్ట శక్తుల పీడనుండి, గ్రహాల దుస్థితినుండి రక్షిస్తాడు శ్వేతార్క ఆంజనేయ స్వామి. అంతేకాదు, బారారిష్ట దోషాలను తొలగిస్తాడు శ్వేతార్క ఆంజనేయ స్వామి.

కొందరు పిల్లలకు పుట్టుకతో బాలారిష్ట దోషాలు వస్తాయి. ఈ దోషాలు పిల్లలు పదమూడో ఏట అడుగు పెట్టేవరకూ అనేక రకాలుగా పీడిస్తాయి. ఇలా బాలారిష్ట దోషాలు ఉన్న చిన్నారులు ఏదో ఒక జబ్బు బారిన పడుతుంటారు. కొందరు పిల్లలు బుద్ధిమాంద్యంతో బాధపడతారు. ఇంకొందరు చిన్నారులు చీటికిమాటికి అనారోగ్యం చేసి అవస్త పడుతూ, బాగా చిక్కిపోతారు. కొందరు బాలలు స్కూలుకు వెళ్ళమని మారాం చేస్తారు. వారిని ఎంత ఒప్పించినా స్కూలుకు పంపడం సాధ్యపడదు. మరికొందరు పిల్లలు మంచి తెలివి ఉండి కూడా చదువుకోరు. సోమరులుగా తయారౌతారు. ఆరోగ్యం దెబ్బ తినడం, చదువుకు దూరం కావడమే కాకుండా కొందరు చిన్నారులు భయాందోళనలకు గురవుతారు. ఈ రకమైన బాలారిష్టాల నుండి గట్టేక్కిస్తాడు శ్వేతార్క ఆంజనేయ స్వామి.

దెయ్యాలు, భూతాలు అనే మాటలు మనకు తరచూ వినిపిస్తుంటాయి. గాలి సోకడం, దెయ్యం పట్టడం, చేతబడులు లాంటి తాంత్రిక శక్తుల మాట వింటే చాలు భయాందోళనలు ఆవరిస్తాయి. వీటి బారిన పడినవారి జీవితం అల్లకల్లోలం అవుతుంది. ఇలాంటి దుష్ట శక్తుల బారినుండి శ్వేతార్క ఆంజనేయ స్వామి కాపాడతాడు.

శ్వేతార్క ఆంజనేయ స్వామిని ఎలా అర్చించాలి అంటే, పూజ ప్రారంభించే రోజున పొద్దున్నే స్నానం చేసి, పూజాస్థలంలో కడిగిన పీట ఉంచాలి. ఆ పీటకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టాలి. పీటమీద ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి, దానిమీద ఒక పళ్ళాన్ని ఉంచాలి. ఆ పళ్ళెంలో అక్షింతలు, పూలు, సింధూరం జల్లి, వాటిమీద శ్వేతార్క ఆంజనేయ స్వామిని ఉంచాలి.

శ్వేతార్క ఆంజనేయ స్వామికి సింధూరం అలంకరించి, పూలమాల వేసి, దీపారాధన చేయాలి. ధ్యాన, ఆవాహనాది విధులతో శ్వేతార్క ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. తర్వాత అష్టోత్తర శతనామ పూజ చేయాలి.
శ్వేతార్క ఆంజనేయ స్వామిని భక్తిపూర్వకంగా ప్రార్ధించాలి. జపమాల చేత ధరించి -
''ఓం ఆంజనేయాయ విద్మహే
వాయుపుత్రాయ ధీమహి
తన్నో హనుమాన్ ప్రచోదయాత్''
అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

జపం ముగిసిన తర్వాత శ్వేతార్క ఆంజనేయ స్వామికి ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాలి. నీరాజనం, మంత్రపుష్పం మొదలైన సేవలు ముగిసిన తర్వాత శ్వేతార్క ఆంజనేయ స్వామి పాదాల వద్దనున్న అక్షింతలు తీసి, తలమీద జల్లుకోవాలి.

ఆ తర్వాత శ్వేతార్క ఆంజనేయ స్వామికి ఉద్వాసన చెప్పి, విగ్రహం తీసి, పూజా మందిరంలో ప్రతిష్టించుకోవాలి. ఇలా శ్వేతార్క ఆంజనేయ స్వామిని మన పూజా మందిరంలో ప్రతిష్టించుకున్న పిదప రోజూ చేసే పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక శ్వేతార్క ఆంజనేయ స్వామిని ధ్యానించాలి.
''ఓం ఆంజనేయాయ విద్మహే
వాయుపుత్రాయ ధీమహి
తన్నో హనుమాన్ ప్రచోదయాత్'' మంత్రాన్ని 11 సార్లు జపించాలి.
ఇలా శ్వేతార్క ఆంజనేయ స్వామిని భక్తి ప్రపత్తులతో పూజించేవారికి ఎలాంటి బాధలు, భయాలు ఉండవు. ఏ విధమైన చీడలు, పీడలు సోకవు. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరతాయి.
ఆంజనేయస్వామికి అభిషేకం.....

ఆవుపాలతో - సర్వసౌభాగ్యాలు
ఆవుపెరుగుతో- కీర్తి మరియు ఆరోగ్యప్రాప్తి
ఆవునెయ్యి -ఐశ్వర్యం
తేనె - తేజస్సువృధ్ధి
పంచదార - దు:ఖాలు నశిస్తాయి
చెరకురసం - ధనం వృధ్ధి చెందుతుంది
కొబ్బరినీళ్ళతో - సర్వసంపదలు వృధ్ధిచెందుతాయి .
విబూధి తో - సర్వపాపాలు నశిస్తాయి
పుష్పోదకం - భూలాభాన్ని కలుగజేస్తుంది
బిల్వజలాభిషేకం- భోగభాగ్యాలు లభిస్తాయి
గరికనీటితో - పోగొట్టుకున్న ధన,కనక,వస్తు ,వాహనాదులను తిరిగిపొందగలుగుతారు.
రుద్రాక్షోదకం తో - ఐశ్వర్యం
సువర్ణోదకం తో - దారిద్ర్యాన్ని పోగొడుతుంది
అన్నంతో అభిషేకం తో - సుఖం కలిగి ఆయుష్షుపెరుగుతుంది.
ద్రాక్షారసంతో - జయం కలుగుతుంది
కస్తూరిజలాభిషేకంచేస్తే - చక్రవర్తిత్వాన్ని ప్రసాదిస్తుంది.
నవరత్నజలాభిషేకం - ధనధాన్య, పుత్ర సంతానం, పశుసంపద లభింపజేస్తుంది
మామిడిపండ్లరసం తో - చర్మ వ్యాధులు నశిస్తాయి
పసుపునీటితో - సకలశుభాలు ,సౌభాగ్యదాయకం
నువ్వులనూనె తో అభిషేకిస్తే - ,అపమృత్యు నివారణ .
సింధూరంతో అభిషేకంతో- శని దోషపరిహారం
Jyeshta ekadasi

Nirjala Ekadashi is the most important and significant Ekadashis out of all twenty four Ekadashis in a year. Nirjala means without water and Nirjala Ekadashi fasting is observed without water and any type of food. Nirjala Ekadashi Vratam is the toughest among all Ekadashi fasting due to strict fasting rules. Devotees abstain not only from food but also from water while observing Nirjala Ekadashi Vrat.

Benefits - Devotees who are unable to observe all twenty fours Ekadashi fasting in a year should observe single Nirjala Ekadashi fasting as fasting on Nirjala Ekadashi brings all benefits of twenty four Ekadashi fasting in a year.

Nirjala Ekadashi is also known as Pandava Ekadashi and Bhimseni or Bhima Ekadashi due to one legend associated with Nirjala Ekadashi. Bhimsen, the second Pandava brother and voracious eater, was not able to control his desire of having food and was not able observe Ekadashi fasting. Except Bhima, all Pandava brothers and Draupadi used to observe all Ekadashi fasting. Bhima, being upset due to his weak determination and doing a dishonor to Lord Vishnu, met Maharishi Vyasa to find some solution. Sage Vyasa advised Bhima to observe single Nirjala Ekadasi fasting to compensate for not observing all Ekadashi fasting in a year. Due to this legend Nirjala Ekadashi is also known as Bhimseni Ekadashi or Pandava Ekadashi.

Time - Nirjala Ekadashi fasting falls during Shukla Paksha of Jyaishta month and currently falls in month of May or June. Nirjala Ekadashi falls just after Ganga Dusshra but in some years Ganga Dussehra and Nirjala Ekadashi might fall on the same day.

Parana means breaking the fast. Ekadashi Parana is done after sunrise on next day of Ekadashi fast. It is necessary to do Parana within Dwadashi Tithi unless Dwadashi is over before sunrise. Not doing Parana within Dwadashi is similar to an offence.

Parana should not be done during Hari Vasara. One should wait for Hari Vasara to get over before breaking the fast. Hari Vasara is first one fourth duration of Dwadashi Tithi. The most preferred time to break the fast is Pratahkal. One should avoid breaking the fast during Madhyana. If due to some reasons one is not able to break the fast during Pratahkal then one should do it after Madhyana.

At times Ekadashi fasting is suggested on two consecutive days. It is advised that Smartha with family should observe fasting on first day only. The alternate Ekadashi fasting, which is the second one, is suggested for Sanyasis, widows and for those who want Moksha. When alternate Ekadashi fasting is suggested for Smartha it coincides with Vaishnava Ekadashi fasting day.

Ekadashi fasting on both days is suggested for staunch devotees who seek for love and affection of Lord Vishnu

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రమ్

ఆదిత్య విష్ణువిఘ్నేశ రుద్ర బ్రహ్మ మరుదణా:

లోకపాలా స్సర్వదేవా శ్చరాచర మిదం జగత్

సర్వం త్వమేవ బ్రహ్మైవ అహమక్షర మద్యయమ్

అప్రమేయం మహాశంత మచలం నిర్వికారకమ్

నిరాలంబం నిరాభాసం సత్తామత్రమగోచరమ్

ఏవం త్వాం మేధయా బుద్ధ్యా సదా పశృంతి సూరయ:

ఎవమజ్ఞాన గాడాంధతమొపహత చేతన:

సపశ్యంతి తథా ముధా: సదా దుర్గతి హేతవే.

విష్ట్యాదీని స్వరూపాణి లిలాలోక విడంబనమ్

కర్తుముద్యమ్య రూపాణి వివిధాని భవంతి చ

తత్తదుక్తా: కథా స్సమ్యక్ నిత్యసద్గతి ప్రాప్తయే

భక్త్యా శ్రుత్వా పఠిత్వా చ దృష్ట్యా సంపూజ్య శ్రద్ధయా

సర్వాన్యామానవాప్నోతి భవదారాధనాత్ఖలు

మమ పూజా మనుగ్రాహ్య సుప్రసీద భవానఘ

చపలం మన్మథ వశమమర్యాదమాసూయకమ్

పంచకం దుఖజనకం పాపిష్టం పాహి మాం ప్రభో

సుబ్రహ్మణ్య స్తోత్ర మిదం యే పఠంతి ద్విజోత్తమాః

తే సర్వే ముక్తిమాయాంతి సుబ్రహ్మణ్య ప్రదాదతః

ఇతి శ్రీ సుబ్రహ్మణ్యస్తోత్రమ్
పరమేశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ లింగరూపాన్ని దర్శించుకునే వారికి సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అందులో కీలకమైన పంచలింగాలు. పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు.

1. పృథ్విలింగం:
ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.

2. ఆకాశలింగం:
ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.

3. జలలింగం:-
ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను.

4. తేజోలింగం:
తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.

5. వాయులింగం:
ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం. ఇవే పంచభూతలింగాలుగా ప్రసిద్ధి చెందినవి
మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు బోవునే మదనములకు !
నిర్మల మందాకినీ వీచికల దూగు
రాయంచ సనునె తరంగిణులకు !
లలితా రసాల పల్లవ ఖాదియై చొక్కు
కోయిల సేరునే కు తజములకు !
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక
మ్మరుగునే సాంద్ర నీహారములకు !

అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పాన విశేష మట
చిత్త మీ రీతి నితరంబు చేర నేర్చు
వినుత గుణ శీల మాటలు వేయు నేల !!

Ramanamam


 పురాణాలలో సర్వశాస్త్రాలు ఇమిడి ఉన్నాయని పెద్దలంతా చెబుతూ ఉంటారు. అసలీ పురాణమంటే అర్థమేమిటి? పురాణాలు ఎన్ని ఉన్నాయి? వాటన్నిటినీ ఎవరితో పోల్చి చెబుతారు? అనే విషయాలను గురించి వివరించి చెబుతుంది ఈ కథా సందర్భం. పద్మపురాణం ఆది ఖండంలో దీనికి సంబంధించిన వివరణ ఉంది.

పురాణాలు మొత్తం పద్దెనిమిది. వీటికంటూ కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఈ పురాణాలన్నీ శ్రీ మహావిష్ణువు స్వరూపంతో సరిపోతాయి. అందుకే శ్రీమహావిష్ణువును పురాణ పురుషుడని అంటూ ఉంటారు. ఆ నారాయణుడి
1) హృదయం పద్మపురాణం
2) చర్మం వామన పురాణం
3) తొడలు భాగవత పురాణం
4) మెదడు మత్స్యపురాణం
5) పృష్ణభాగం కూర్మపురాణం
6) కుడికాలు చీలమండ వరాహ పురాణం
7) బొడ్డు నారదపురాణం వెంట్రుకలు స్కందపురాణం
9) ఎడమ భుజం శివపురాణం
10) కుడి భుజం విష్ణుపురాణం
11) ఎడమపాదం అగ్నిపురాణం
12) కుడిపాదం మార్కండేయ పురాణం
13) కుడిమోకాలు భవిష్యపురాణం అని పద్మపురాణంతోపాటు ఇతర పురాణాలు కూడా వివరించి చెబుతున్నాయి.

పురాణానికి కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఆ లక్షణాలున్నదే పురాణం అవుతుంది. ప్రధానంగా పురాణానికి అయిదు లక్షణాలను పేర్కొన్నారు. కాలక్రమంలో కొంతమంది పది లక్షణాలు కూడా ఉన్నాయని చెప్పారు.

అయిదు లక్షణాలలో
1) సర్గం
2) ప్రతిసర్గం
3) వంశం
4) మన్వంతరం
5) వంశాను చరితం
పురాణానికి ఈ అయిదు లక్షణాలు ఉంటాయని పురాణాలతోపాటు, నిఘంటువులు కూడా స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ అయిదు లక్షణాలు మనకున్న పద్దెనిమిది పురాణాలలో ఒక్కోదానిలో ఒక్కొక్క లక్షణం ఎక్కువగా, మరో లక్షణం తక్కువగా వర్ణితమై కనిపిస్తుంది. ఎక్కువ తక్కువుల మాటఎలాఉన్నా అయిదు లక్షణాలు మాత్రం ఉండి తీరాల్సిందే.

వీటిలో
1) మొదటిదైన సర్గం అనే దానికి అర్థం సృష్టి అని, ఈ సృష్టి అంతా ఎలా జరిగింది? పంచతన్మాత్రలు, పంచభూతాలు ఎలా ఉద్భవించాయి? అని వివరించటమే సర్గం.
2) రెండో లక్షణం ప్రతిసర్గం. సర్గానికి వ్యతిరేకం ప్రతిసర్గం. అంటే సృష్టి ఎలా లయమవుతుంది? ప్రళయాలు ఎన్ని రకాలు? అవి ఎలా ఏర్పడుతాయి? అని వివరించటమే ప్రతిసర్గం
3) మూడో లక్షణమైన వంశంలో సృష్టి ప్రారంభం నుంచి ఎంతమంది రాజులు, వారి వంశాలు, ఆవిర్భవించాయి. వారి వంశాలు వర్ణనతో పాటు రుషుల వంశాలకు సంబంధించిన విషయ వివరణలు ఈ లక్షణంలో కనిపిస్తాయి.
4)నాలుగో లక్షణం మన్వంతరం. ఇది కాలగణనాన్ని చెబుతుంది. పద్నాలుగు మన్వంతరాల విషయాలు, వాటి అధిపతులు, వారికి సంబంధించిన విషయాలన్నీ దీనిలో వస్తాయి.
5)అయిదో లక్షణమే వంశాను చరితం. దీనిలో సృష్టి మొదలైన దగ్గర నుంచి పాలించిన రాజులు, చక్రవర్తుల, రుషుల వంశ చరిత్రలు వర్ణితమవుతాయి.

ఇలా ఈ అయిదు ప్రధాన లక్షణాలు తొలినాళ్ళ నుంచి అంతా పురాణాలకు ఉంటాయని, ఉండాలని చెబుతూ వస్తున్నారు. కాలక్రమంలో కొంతమంది ఈ అయిదు లక్షణాలను పది లక్షణాలుగా చేసి అలాంటి పది లక్షణాలు పురాణాలకు ఉండాలని చెప్పారు. సర్గ, విసర్గ, వృత్తి, రక్షణ, అంతరాలు, వంశం, వంశాను చరితం, సంస్థ, హేతువు, అపాశ్రయం అనే పది లక్షణాలను అనంతర కాలంలో వచ్చిన వారు పేర్కొన్నారు.

1) సర్గ అంటే ఇక్కడ కూడా సృష్టి అనే అర్థం.
2) విసర్గ అంటే జీవుల సృష్టి అని అర్థం చెబుతారు.
3) వృత్తి అనే పదానికి మనిషి తన జీవితాన్ని సాగించటానికి ఏ ఏ వస్తువులను వాడుతారో వాటిని గురించిన విషయాల వివరణ.
4) రక్షణ అంటే భగవంతుడు ధర్మ రక్షణకోసం అవతరించే తీరు అని అర్థం.
5) అంతరాలు అంటే మన్వంతరాల వివరణ.
6) వంశం అంటే రాజుల, రుషుల, వంశాల వివరణ.
7) వంశాను చరితం అంటే రాజుల, రుషుల వంశ క్రమంలో ఉన్న అన్ని తరాల చరిత్ర వివరణ. సంస్థ అంటే ప్రళయానికి సంబంధించిన వివరణ.
9) హేతువు అని అంటే జీవుడి జనన మరణాలకు మధ్యన ఉన్న కర్మ సంబంధమైన విషయం. జీవుడు చేసే కర్మను బట్టే అతడి జీవితమైనా, సృష్టి అయినా అంతమవుతుందని చెప్పే విషయానికి సంబంధించిన వివరణ.
10) అపాశ్రయం అని అంటే పరబ్రహ్మం అని అర్థం. ఆ పరబ్రహ్మ శక్తినే అపాశ్రయ శక్తి అని అంటారు. దానికి సంబంధించిన వివరాలు దీంట్లో ఉంటాయి.

ఈ పది లక్షణాలు భాగవతం ద్వితీయ స్కందంలో మళ్ళీ కొద్దిపాటి తేడాతో కనిపిస్తున్నాయి. సర్గ, ప్రతిసర్గ, స్థానం, పోషణం, ఊతయం, మన్వంతరం, ఈశాను కథ, నిరోధం, ముక్తి, ఆశ్రయం... ఈ పది లక్షణాలు పేర్లలో తేడా ఉన్నా అర్థం మాత్రం ఒకటేనని పురాణజ్ఞలు వివరించి చెబుతున్నారు.

పురాణాల పేర్లు చెప్పే శ్లోకం
సత్రయాగం జరుగుచున్నప్పుడు అష్టాదశపురాణాలను తెలుపుతూ సూతుడు ఋషులకు చెప్పిన శ్లోకం. భాగవత పురాణము ప్రధమ స్కందము లో చెప్పబడింది.

మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం
అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్
పైన చెప్పిన వాటిలో:
"మ" ద్వయం -- మత్స్య పురాణం, మార్కండేయ పురాణం
"భ" ద్వయం -- భాగవత పురాణం, భవిష్య పురాణం
"బ్ర" త్రయం -- బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం
"వ" చతుష్టయం -- విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం
మిగిలిన వాటి పేర్ల మొదటి అక్షరాలు మాత్రమే తీసుకుని శ్లోకపాదం కూర్చటం జరిగింది:
అ -- అగ్ని పురాణం
నా -- నారద పురాణం
పద్ -- పద్మ పురాణం
లిం -- లింగ పురాణం
గ -- గరుడ పురాణం
కూ -- కూర్మ పురాణం
స్కా -- స్కాంద పురాణం
అష్టాదశ పురాణములలో శ్లోకాలు [3]
బ్రహ్మ పురాణం - బ్రహ్మదేవుడు మరీచికి బోధించినది. 10,000 శ్లోకములు కలది.
పద్మ పురాణము - బ్రహ్మదేవునిచే చెప్పబడినది. 55,000 శ్లోకములు కలది.
విష్ణు పురాణం - పరాశరుని రచన. దీనిలో 63,000 (8,000?) శ్లోకములు ఉన్నాయి.
శివ పురాణం - వాయుదేవునిచే చెప్పబడినది. ఇందులో 24,000 శ్లోకాలున్నాయి.
లింగ పురాణము - నందీశ్వరుని రచన. 11,000 శ్లోకాలు ఉన్నది.
గరుడ పురాణం - విష్ణుమూర్తి గరుత్మంతునికి చెప్పిన ఈ పురాణంలో 19,000 (16,000?) శ్లోకాలున్నాయి.
నారద పురాణము - నారద మహర్షి రచన. 24,000 (25,000?) శ్లోకములు కలది.
భాగవత పురాణం- శుకమహర్షి పరీక్షిత్తునకుపదేశించినది. 18,000 శ్లోకములు కలది.
అగ్ని పురాణం - భృగుమహర్షిచే చెప్పబడినది. 16,000 (8,000?) శ్లోకములు కలది.
స్కంద పురాణం - కుమారస్వామిచే చెప్పబడినది. 80,000 (లక్ష?) ఇందు శ్లోకములు ఉన్నాయి.
భవిష్య పురాణం లేదా భవిష్యోత్తర పురాణం - శతానీకుడు సుమంతునకు బోధించినది. 14,500 (31,000?) శ్లోకములు ఉన్నాయి.
బ్రహ్మవైవర్త పురాణం - వశిష్ట మహర్షి అంబరీషునకు ఉపదేశించినది. 18,000 (12,000) శ్లోకములు కలది.
మార్కండేయ పురాణం - పక్షులు క్రోష్టి(జైమిని)కి చెప్పినట్లుగా మార్కండేయమహర్షి రచించెను. 9,000 (32,000?) శ్లోకములు ఉన్నది.
వామన పురాణము - బ్రహ్మదేవుని రచన - 14,000 శ్లోకములు కలది.
వరాహ పురాణం - శ్రీవరాహమూర్తి భూదేవికి ఉపదేశించినది. ఇందు 24,000 శ్లోకములు ఉన్నాయి.
మత్స్య పురాణం - శ్రీమత్స్యావతారుడైన విష్ణువు మనువునకు ఉపదేశించెను. దీనిలో 14,000 శ్లోకాలున్నాయి.
కూర్మ పురాణం - శ్రీకూర్మావతారుడైన విష్ణువు ఉపదేశించెను. దీనిలో 17,000 (6,000) శ్లోకాలున్నాయి.
బ్రహ్మాండ పురాణం - బ్రహ్మదేవుని రచన- 1,100 (12,200?) శ్లోకములున్నది.
దేవతాప్రాముఖ్యాన్ని గుణాన్ని చెప్పే శ్లోకం
ఈ క్రింది శ్లోకం అష్టాదశ పురాణాలను మూడు విధాలుగా విభజిస్తూ వైష్ణవ, శైవ, బ్రహ్మ పురాణాలుగా చెబుతుంది.

వైష్ణవం నారదీయం చ తధా భాగవతం శుభం గారుడంచ తధా పాద్మం
వరాహం శుభదర్శనే సాత్వికాని పురాణాని విష్ణ్వేయాని శుభానిదై
బ్రహ్మాండం బ్రహ్మ వైవర్తం మార్కండేయం తధైవ చ భవిష్యం వామనం బ్రహ్మరాజ నిబోధతే
మాత్స్య కౌర్మం తధా లైంగ శైవం స్కౌందం ఆగ్నేయంచ షడేతాని తామసాని భోధమే


ఇలాంటిదే మరొక శ్లోకం

బ్రాహ్మం పాద్వం వైష్ణవంచ శైవం వైంగం చ గారుడమ్
నారదీయం భాగవతం ఆగ్నేయం స్కాంద సంజ్ఞికమ్
భవిష్యం బ్రహ్మవైవర్తం మార్కండేయం చ వామనమ్
వారాహం మత్స్య కౌర్మాణి బ్రహ్మాండాఖ్యమితి త్రిషట్

వైష్ణవ పురాణాలు - సాత్విక గుణాన్ని
బ్రహ్మ పురాణాలు - రాజస గుణాన్ని
శైవ పురాణాలు - తామస గుణాన్ని ప్రధానంగా కలిగి ఉంటాయి అని పై శ్లోకం అర్థం
మణికర్ణికాష్టకమ్
త్వత్తీరె మణికర్ణికె హరిహరౌ సాయుజ్యముక్తిప్రదౌ
వాదన్తౌ కురుతః పరస్పరముభౌ జన్తోః ప్రయాణోత్సవె !
మద్రూపో మనుజోయమస్తు హరిణా ప్రోక్తః శివస్తత్క్షణాత్
తన్మధ్యాఙ్గులాఞ్ఛనో గరుడగః పీతాంబరోనిర్గతః !!౧

ఇంద్రాధ్యాస్త్రిదశాః పతన్తి నియతం భోగక్షయే యే పున
ర్జాయంతే మనుజాస్తతోపి పశవః కీటాః పతఙ్గాదయః !
యే మాతర్మణికర్ణికే తవ జలె మజ్జన్తి నిష్కల్మషాః
సాయుజ్యేపి కిరీట కౌస్తుంభధరా నారాయణాః స్యుర్నరాః !!౨

కాశీ ధన్యతమా విముక్తనగరీ సాలంకృతా గఙ్గయా
తత్త్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హి తత్కింకరీ !
స్వర్లోకస్తులితః సహైవ విబుధైః కాశయా సమం బ్రహ్మణా
కాశీ క్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుత్వం గతః !!౩

గఙ్గాతీరమనుత్తమం హి సకలం తత్త్రాపి కాశ్యుత్తమా
తస్యాం సా మణికర్ణికోత్తమతమా యెత్రెక్శరో ముక్తిదః !
దేవానామపి దుర్లభం స్థలమిదం పాపైఘనాశక్షమం
పూర్వోపార్జితపుణ్యపుఞ్జగమకం పుణ్యైర్జనైః ప్రాప్యతే !! ౪

దుఃఖాంభోధిగతో హి జంతునివహస్తేషాం కథం నిష్కృతిః
ఙాత్వా తద్ది విరించినా విరచితా వారణాసీ శర్మదా !
లోకాః స్వర్గసుఖాస్తతోపి లఘవో భోగాంతపాతప్రదాః
కాశీ ముక్తిపురీ సదా శివకరీ ధర్మార్థమోక్షప్రదా !!౫

ఏకో వేణుధరో ధరాధరధరః శ్రీవత్సభూషాధరః
యోప్యేకః కిల శంకరో విషధరో గఙ్గాధరో మాధవః !
యే మాతర్మణికర్ణికే తవ జలె మజ్జన్తి తే మానవాః
రుద్రా వా హరయో భవన్తి బహవస్తేషాం బహుత్వం కథమ్ !!౬

త్వత్తీరే మరణం తు మంగళకరం దేవైరపి శ్లాఘ్యతే
శత్రుస్తం మనుజం సహస్రనయనౌర్ద్రష్టుం సదా తత్పరః !
ఆయాంతం సవితా సహస్రకిరణౌః ప్రత్యుగ్దతోభుత్సదా
పుణ్యోసౌ వృషగోథవా గరుడగః కిం మందిరం యాస్యతి !!౭

మధ్యాహ్నే మణికర్ణికాస్నపనజం పుణ్యం న వక్తుం క్షమః
శ్రియైరబ్దశతైశ్చతుర్ముఖధరో వేదార్థదీక్షాగురుః !
యోగాభ్యాసబలేన చంద్రశిఖరస్తత్పుణ్యపారంగతః
త్వత్తీరే ప్రకరోతి సుప్తపురుషం నారయణం వా శివం !!౮

క్రుఛ్చైరః కోటిశతైః స్వపాపనిధనం యచ్చాశ్వమేధైః ఫలం
తత్సర్వే మణికర్ణికాస్నపనజె పుణ్యే ప్రవిష్ఠం భవేత్ !
స్నాత్వా స్తోత్రమిదం నరః పఠతి చేత్సంసారపాథోనిధిం
తీర్త్వా పల్వలవత్ప్రయాతి సదనం తేజొమయం బ్రహ్మణః !!౯

ఇతి శ్రీ మత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీ గోవిందభగవత్పూజ్యపాదశిష్యస్
శ్రీమఛ్చంకరభగవతః కృతౌ మణికర్ణకాష్టకం సంపూర్ణం!!
Padmanabha swami temple thiruvananthapuram
శ్రీ వెంకటేశ్వరుడు వెంట్రుకలే ఎందుకు అడుగుతాడు?

మనకి పాపాలు అన్ని ఎక్కడ ఉంటాయి అంటే వెంట్రుకుల మొదళ్ళుని ఆశ్రయించి ఉంటాయ్. ఆ పాపాలు తీసేయడానికి స్వామి తల వెంట్రుకలు అడుగుతాడు. కలియుగంలో ఏది ఇవ్వాలన్న అందరికి కక్కుర్తి. మన ప్రమేయం లేనిది, మనం పెంచాల్సిన అవసరం లేని దానిని, తనంతట తాను పెరిగేది, భగవంతుని కృప చేత ఉండేది మాత్ర మే ఆయన తీసుకుంటాడు. కాబట్టి తిరుమల వెళ్ళండి, మీ తల వెంట్రుకలు ఇవ్వండి & మీ పాపాలు తొలగిపోతాయ్.

వేంకటాచలం చాలా ప్రసిద్ధమైన క్షేత్రం. తిరుమల తర్వాత కాశి కి మళ్లి అంత ప్రత్యేకత ఉంది. మీరు కాశి అడుగు పెట్టినంత మాత్రం చేతనే మీ పాపాలు అన్ని చెట్లు ఎక్కి కుర్చుంటాయి . మీరు ఏడు
రాత్రులు గనక గడిపితే, మీ పాపాలు పూర్తిగా తొలగిపోతాయ్.
శ్రీహరి స్తుతి
" సకృదుచ్చరితం యేన హరిదిత్యక్షరద్వయం
బద్ధ: పరికరస్తేన మోక్షాయగమనం ప్రతి"
ఎవరైతే హరి అనే రెండక్షరాలను నిత్యం స్మరిస్తుంటారో వారు మోక్షానికి వెళ్ళేందుకు ప్రయాణ సన్నద్ధులై ఉంటారు.
వేంకటశ్వరుడు అంటే?

వేం - పాపము
కట - తీసేయడం
శ్వరుడు - తొలగించేటటు వంటివాడు .

కలియుగంలో ఎవరికీ భగవంతునికి పాదాల యందు మనస్సు నిలబడదు. కలి యొక్క ప్రభావం వల్ల భౌతిక సుఖాల వైపు ఎక్కువ మోజు ఉంటుంది. మనస్సుని నిగ్రహించడం అంత సులభం కాదు. చాలా పాపాలు చేస్తూ ఉంటాం. ఈ పాపాలు చేసేటటు వంటి వారిని ఉద్ధరించడానికి పరమాత్మ "శ్రీ వేంకటేశ్వరుడు" గా ఆవిర్భవించారు. ఆ పాపాల్ని తీసేయగలిగే శక్తి ఆ పరమాత్మకే ఉంది.

ఇక తిరుమల కొండకి వస్తే, సాక్షాత్తు వేదములే ఆ కొండకి రాళ్ళు అయ్యాయి. ఒక్కొక్క యుగం లో ఒక్కో అవతారం ఎత్తి ఆయన ధర్మాన్ని రక్షించాడు.

కృత యుగం - నరసింహావతారం,
త్రేతా యుగం - శ్రీరాముడుగా,
ద్వాపరి యుగం లో - శ్రీ కృష్ణుడుగా,
& కలియుగం లో శ్రీ వేంకటేశ్వరుడుగా అవతరించాడు.

మిగిలిన అవతారారలో చేసినట్లుగా కలియుగం లో స్వామి దుష్ట సంహారం ఏమి చెయ్యలేదు. కత్తి పట్టి ఎవ్వరిని సంహరించలేదు. ఆయన చాలా కాలం వరకు నోరు విప్పి మాట్లాడేవారు. తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చి మాట్లాడ్డం మానేశారు.

కాబట్టి ఆ వేంకటాచల క్షేత్రం పరమపావనమైనటువంటి క్షేత్రం. తిరుమల కొండ సామాన్యమైన కొండేమీ కాదు. ఆ కొండకి, శ్రీ వేంకటేశ్వరునికి ఒక గొప్ప సంబంధం ఉంది. తిరుముల కొండకి ఒక్కో యుగం ఒక్కో పేరు ఉండేది.
కృత యుగం లో - వృషా చలం,
త్రేతా యుగం లో - అంజనా చలం
తరువాత కలియుగం లో - వేంకటా చలం అని పేరు వచ్చింది. యుగాలు మారిపోయినా ఆ కొండ అలాగే ఉంది. ఈ కొండ శ్రీ మహావిష్ణువు యొక్క క్రీడాద్రి.. తిరుమల చాల పవిత్రమైనటు వంటి స్థలం.
శ్రీరామ రామా ,త్రిలోకాభి రామా,పరంధామ ,నిష్కామ సంపూర్ణ కామా,బుదేన్ద్రాంత రంగాబ్ది సోమా,లసద్దివ్య నామా ,విరాజద్గురు స్తోమ ,యుష్మత్ ప్రకాశ స్వరూపంబు అవాచ్యం ,అచింత్యం,అనంతం ,అసంగం ,అఖండం అబాధ్యం,అబోధ్యం ,అభేద్యం ,అవిచ్చేద్యం,ఆద్యంత శూన్యం ,ఆజం ,అప్రమేయం,అవిజ్నేయం ,అధ్యేయం ,అద్వంద్వం,అవ్యక్తం ,అగ్రాహ్యం ,ఆధ్యాత్మ మేకం ,అరూపం ,అనాఖ్యం ,అరక్తం,ఆశుక్లం ,అ కృష్ణం ,అపేతం ,అపీనం,అ సూక్ష్మం ,అదీర్ఘం ,ఆహ్రస్వం,అబాహ్యాంతరం ,అక్షరం ,అవ్యయం,ఇంద్రియా గోచరం ,అప్రతర్క్యం,అనిర్దేశ్యం ,ఆద్యం ,అద్రుశం,అకంపం ,అలక్ష్యం ,అలిప్తం,ఆశబ్దం ,అసంస్పర్శ భూతం ,అరూపం,అసుస్వాదు గంధం ,అవాన్మానస ప్రాప్యమై ,పూర్ణ మై ,నిత్యమై,సత్యమై ,శుద్ధ మై ,బుద్ధ మై,ముక్త మై ,శాంతమై ,కేవలంబై,నిరాకారమై ,సచ్చి దానంద రూపాత్మచైతన్యమై ,సర్వ భూతోరు దేహెంద్రియ ప్రాణ హృద్బుద్ధ్య హంకార ,చిత్తాది ,దృశ్య ప్రపంచంబు ,నాదిత్యుడీ విశ్వ మెల్లన్ ,వెలింగిమ్పగా ,జేయు రీతిన్ ,ప్రకాశింపగా జేయగా,సాక్షి వై ,యాకసం బేకమై ,సర్వ భాండంబు లందు అంతట న్,లోపలన్,వెల్పలన్ నిండి యున్నట్టుల్ ఆకాశ వాయ్వగ్ని వార్భూమి ,,నానా విధా శేష భూతం బు లందు అంతట న్,నిర్వి లిప్తున్దవై యుండి,కర్తృత్వ ,భోత్క్రుత్వ,మంత్రత్వ ,భర్త్రుత్వ,హర్త్రుత్వ ముల్ ,నామ రూప క్రియో పాది వర్నాశ్రమంబు లు గుణమ్బుల్ ,వివేకా వివేకంబుల్,శోక మొహమ్బులన్ ,లేక ,ఈ స్థూల శూక్ష్మాదులన్ ,జాగర స్వప్న సుప్త్యాదుల్ ,పంచ భూతంబులన్,పంచ కోశంబులన్ ,చూచుచున్,నిర్వి కారున్డవై ,నిర్వి కల్పున్డవై ,నిర్వి చేష్టున్దవై,నిష్ప్రపంచుండ వై ,నిర్వి శేషున్డవై ,నిర్గుణ బ్రహ్మ మాత్రున్డవై ,యొప్పు ,నీ దివ్య తత్వంబు ,నీ సత్క్రుపా,సంభ్రుతాంచాట్ కటాక్షంబు చేతం గనున్గొంటి దేవా ,నమస్తే ,నమస్తే,నమస్తే నమః

బ్రమరాంబికాష్టకం

శ్రీ కంఠార్పితపత్రగండయుగళాం సింహాసనాధ్యాసినీం
లోకానుగ్రహకారిణీం గుణవతీం లోలేక్షణాం శాంకరీం
పాకారిప్రముఖామరార్చితపదాం మత్తేభకుంభస్తనీం
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్

వింధ్యాద్రీంద్రగృహాన్తరే నివసతీం వేదాన్తవేద్యాం నిధిం
మందారద్రుమపుష్పవాసితకుచాం మాయాం మహామాయినీః
బంధూక ప్రసవోజ్వలారుణనిభాం పంచాక్షరీరూపిణీం
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్

మాద్యచ్ఛుంభనీశుంభమేఘపటల ప్రధ్వంసజంఝానిలాం
కౌమారీ మహిషాఖ్యశుష్కవిటపీ ధూమోరుదావానలాం
చక్రాద్యాయుధసంగ్రహోజ్జ్వలకరాం చాముండికాధీశ్వరీం
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్

కేళీమందిరరాజతాచలసరో జాతోరుశోభాన్వితాం
నక్షత్రేశ్వరశేఖరప్రియతమాం దేవీ జగన్మోహినీమ్
రంజన్మంగళదాయినీం శుభకరీం రాజత్స్వరూపోజ్జ్వలాం
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్

సంసారార్ణవతారికాం భగవతీం దారిద్ర్యవిధ్వంసినీం
సంధ్యాతాండవకేళికప్రియసతీం సద్భక్తకామప్రదాం
శింజన్నూపురపాదపంకజయుగాం బింబాధరాం శ్యామలాం
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్

చంచత్కాంచనరత్నచారుకటకాం సర్వంసహావల్లభాం
కాంచీకాంచనఘంటికాఘణఘనాం కంజాతపత్రేఓనాం
సారోదారగునాంచితాం పురహర ప్రాణేశ్వరీం శాంభవీం
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్

బ్రహ్మర్షీ శ్వరవంద్పాదకమలాం పంకేరుహాక్షస్తుతాం
ప్రాలేయాచలవంశపావనకరీం శృంగారభూషానిధఙం
తత్త్వాతీతమహాప్రభాం విజయినీం దాక్షాయణీం భూరవీం
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్

భ్రమరాంబామహాదేవ్యా అష్టకం సర్వసిద్ధిదం
శత్రూనాం చాసురాణాం చ ధ్వంసనం త ద్వదా మ్యహమ్.
బ్రమరాంబికాష్టకం

శ్రీ కంఠార్పితపత్రగండయుగళాం సింహాసనాధ్యాసినీం 
లోకానుగ్రహకారిణీం గుణవతీం లోలేక్షణాం శాంకరీం 
పాకారిప్రముఖామరార్చితపదాం మత్తేభకుంభస్తనీం 
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్

వింధ్యాద్రీంద్రగృహాన్తరే నివసతీం వేదాన్తవేద్యాం నిధిం 
మందారద్రుమపుష్పవాసితకుచాం మాయాం మహామాయినీః
బంధూక ప్రసవోజ్వలారుణనిభాం పంచాక్షరీరూపిణీం 
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్

మాద్యచ్ఛుంభనీశుంభమేఘపటల ప్రధ్వంసజంఝానిలాం 
కౌమారీ మహిషాఖ్యశుష్కవిటపీ ధూమోరుదావానలాం 
చక్రాద్యాయుధసంగ్రహోజ్జ్వలకరాం చాముండికాధీశ్వరీం 
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్

కేళీమందిరరాజతాచలసరో జాతోరుశోభాన్వితాం 
నక్షత్రేశ్వరశేఖరప్రియతమాం దేవీ జగన్మోహినీమ్
రంజన్మంగళదాయినీం శుభకరీం రాజత్స్వరూపోజ్జ్వలాం 
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్

సంసారార్ణవతారికాం భగవతీం దారిద్ర్యవిధ్వంసినీం 
సంధ్యాతాండవకేళికప్రియసతీం సద్భక్తకామప్రదాం 
శింజన్నూపురపాదపంకజయుగాం బింబాధరాం శ్యామలాం 
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్

చంచత్కాంచనరత్నచారుకటకాం సర్వంసహావల్లభాం
కాంచీకాంచనఘంటికాఘణఘనాం కంజాతపత్రేఓనాం 
సారోదారగునాంచితాం పురహర ప్రాణేశ్వరీం శాంభవీం
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్

బ్రహ్మర్షీ శ్వరవంద్పాదకమలాం పంకేరుహాక్షస్తుతాం 
ప్రాలేయాచలవంశపావనకరీం శృంగారభూషానిధఙం 
తత్త్వాతీతమహాప్రభాం విజయినీం దాక్షాయణీం భూరవీం 
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్

భ్రమరాంబామహాదేవ్యా అష్టకం సర్వసిద్ధిదం 
శత్రూనాం చాసురాణాం చ ధ్వంసనం త ద్వదా మ్యహమ్.
Sri Varadharaaja Swami, Kaanchipuram, Tamil Nadu, Bharath.

The temple is situated in Vishnu Kanchi, also known as the Little Kanchipuram. The Moolasthana is on a little hillock called Hasthagiri.

Once Brahma is said to have performed a very big Yagna, and during the time of Poornahuthi all the Gods and Devas were present there, when Lord Mahavishnu appeared out of the Yagna Kund. They requested him to stay there for ever to bless the devotees. He readily acceded to their wish and made Hastagiri his abode. He was hailed as the King of boon-givers, Varadaraja. He resides in Punyakotivimanam by the side of Ananda Pushkarani-the Holy tank.

Ramanuja, the exponent of the Visishtadvaitha philosophy of the Hindu Religion, had his education here.

The great work of Krishna Deva Raya, the Vijayanagar King, for the temple, the services rendered by Lakshmikumar Tatacharya, which is continued today by the Tatacharya family, the Shrine of Perundevi Thayar, the paintings of the 108 Vaishnavite Divya Desas and the exquisite beauty of the 100 pillared mandapam, attract the attention of pilgrims. It is recorded that King Achyuta Raya of the Vijayanagar dynasty, was weighed against gold (Tulabaram) which was utilized for a grant of houses for the Vedic Pandits who rendered services to the Lord of Hasthagiri.

One of the important temples which is included in the itinerary of pilgrims and tourists throughout the country. Gardua Sevai-Procession of the Lord mounted on Garudavahana- is a very popular and colourful festival in this temple during the Tamil month of Vaikasi (May-June).

In the temple tank, an idol of Varadaraja, made out of a fig wood (Atthivaradhan) lies immersed. Once in 40 years, the murthi is taken out and kept on display for 10 days for devotees to have darshan . Special Pujas are performed during these 10 days
చేతులారంగ శివునిఁ బూజింపఁడేని
నోరునొవ్వంగ హరికీర్తినుడువఁడేని
దయయు సత్యంబులోనుగాఁ దలఁపడేని
గలుగనేటికిఁ దల్లుల కడుపుచేటు.

’చేతులారంగ’ అంటే చేతులనిండుగా తృప్తితో శివపూజ చేయనివాడూ, ’నోరునొవ్వంగ’ అంటే ఎల్లప్పుడూ హరినామ, గుణకీర్తనం చేయనివాడూ, సత్యమూ, దయా మొదలైన మంచి గుణాలను గూర్చి ఆలోచించనివాడూ పుట్టడం కూడా వ్యర్థమే. వాడి జన్మ తల్లికడుపు పంటగా కాకుండా, తల్లికడుపు మంటగా నిలుస్తుంది అంటూ కొంత ఘాటుగానే మందలించినారు పోతన.
వరుణశ్చైవ గోమూత్రే, గోమయే హవ్య వాహనః
దధేవాయుః సముద్దిష్టః సోమః క్షీరేఘ్రుతేరవిః

గో మూత్రంలో వరుణుడు, గోమయంలో అగ్ని, ఆవు పెరుగులో వాయు దేవుడు, ఆవు పాలలో చంద్రుడు, ఆవు నెయ్యిలో సూర్యుడు, ఆవు ముఖంలో,
యోనివద్ద ఇష్టార్ధ దేవతలు కోలువైయున్నారు.

పూర్వ కాలంలో గోవులేన్ని ఎక్కువ ఉంటె వారే శ్రీమంతులుగా వుండేవారు. గో ధనమే నిజ ధనంగా భావించేవారు.గోధనంలేని రాజ్యం క్షీణిస్తుందనే భావన యుండేది.

అందుకనే పాండవులకి అరిష్టం కలిగించాలని ఉత్తర గోగ్రహణ (విరాటపర్వం) జరిపిస్తాడు దుర్యోధనుడు.

గో సంతానంలో కొన్ని పొలం దున్ని ఆహారోత్పత్తికై సహాయపడితే, మరికొన్ని పాలను ప్రసాదించి మానవాళికి వాటి ద్వారా రోగనిరోధక శక్తి ప్రసాదిస్తాయి.
గోవును పూజించి ముమ్మారు ప్రదక్షిణ చెస్తే సర్వ పాపాలు హరిస్తాయి

There are numerous opportunities to learn about good values. They arise by reading books, listening to others and observing the deeds of great men. Having learnt the values, it is but natural to talk about them to others. But advising others is futile if you do not yourself practice them. Realising this, inculcate good qualities in yourself before imparting to others.- Sri Sri Bharati Tirtha Mahaswamigal
There are numerous opportunities to learn about good values. They arise by reading books, listening to others and observing the deeds of great men. Having learnt the values, it is but natural to talk about them to others. But advising others is futile if you do not yourself practice them. Realising this, inculcate good qualities in yourself before imparting to others.- Sri Sri Bharati Tirtha Mahaswamigal
Uzhandru thirintha yennai uthamanagi vaithaay,
Uyariya periyoruddan ondrida kooti vaithaay,
Nizhalena thodarntha munnoozh kodumayai neenga cheythaay,
Nithya kalyaani Bhavaani padhmeshwari

Though I was wandering without aim in the world, you made me holy,You placed me in the good company of great noble souls,
Removed the horrible fate from the last births which was following me like a shadow, Oh Goddess who is always good , Oh Bhavani , Oh goddess of the lotus.
Vandhey Maatharam !!
కౌసల్య మాత రాముడిని అరణ్యానికి పంపిస్తూ ఈ మాటలు అన్నది.

యం పాలయసి ధర్మంత్వం ధృత్యాచ నియమేనచ
సవై రాఘవశార్దూలా ధర్మస్త్వ మభిరక్షతు

చూడు రామ, రాబోయే కాలం నీకు పరీక్ష సమయం. చాలా మంది నీకు తారసపడి వచ్చి ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతారు.

నియమేనచ - నువ్వు మాత్రం ధర్మాన్నే పట్టుకో. ధర్మం నిన్ను రక్షించి తీరుతుంది. కౌసల్య మాత ఇలా ఆశీర్వదించి రాముడుని అడవులకు పంపింది.


yam paalayasi dharmam tvam dhR^ityaa cha niyamena cha |
savai raaghavashaardula! dharmastvaamabhirakshatu || 2-25-3

raaghava shaarduula = Oh; Rama; the bestof born in Raghu dynasty! yam dharmam = which righteousness; tvam = you; paalayasi = are fostering; dhR^itvaa = with courage ; niyamenacha = and discipline; saH dharmaH vai = thatrighteousness; abhirakshhatu = will protect; tvaam = you.
"
Oh, Rama! Let that righteousness, which you are fostering with courage and discipline , protect you".

Sunday, June 2, 2013

ఏలినాటి శని

జ్యోతిష్యం అంటే ఎంత నమ్మకం లేని వాళ్ళయినా ఏలినాటి శని గురించి భయపడతారు. కానీ ఏలినాటి శని అంటే భయపడాల్సిన అవసరమే లేదని ధైర్యం చెప్పారు జ్యోతిష్య నిపుణులు/
. ప్రతి మనిషి జీవితంలో ఏలినాటి శని ముఫ్ఫై ఏళ్ళకొకసారి తప్పక వస్తుంది. ప్రతిసారీ 7 -1/2 సంవత్సరాలు వుంటుంది. సగటున మనిషి జీవితంలో 19 ఏళ్ళు శని ప్రభావంతో గడుపుతారు. శనిని అస్సలు తిట్టకోవాల్సిన అవసరంలేదు. ఎందుకంటే శని ఆయు కారకుడు. శని మందుడు కనుక తలపెట్టిన పనులను ఆలస్యం చేస్తాడు కానీ అసలు కాకుండా చెయ్యడు. వివాహాలు, ప్రమోషన్లు, ఏ శుభ కార్యాలయినా కేవలం శని మూలంగా ఆగవు. అవి కావటం లేదంటే శనే కాకుండా జాతకంలో ఇంకా వేరే గ్రహ ప్రభావాలుకూడా వున్నట్టు.

శనికి శనివారంనాడు అరచేతి వెడల్పు నల్లబట్టలో నల్ల నువ్వులు మూటలాగా కట్టి నవగ్రహాలు వున్నచోటో, లేక ఎక్కడన్నా శనీశ్వరుడుకి దానితో దీపారాధన చేసి, శనివారంనాడు 19 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. జన్మ నక్షత్రం రోజున శివునికి అభషేకం చేయించినా మంచిది

ఏలినాటి శని-నవగ్రహ దోష నివారణకు ఏం చేయాలంటే..?

.

ముఖ్యంగా ఏలినాటి శని మిమ్మల్ని పీడిస్తున్నట్లైతే..? శనివారం పూట నవగ్రహాలకు తొమ్మిది సార్లు ప్రదక్షణ చేసి, శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపమెలిగించడం ద్వారా కొన్ని సమస్యలు దరిచేరవని , ఇలా తొమ్మిది వారాలు చేస్తే ఏలినాటి శని ప్రభావంతో కలిగే దోషాలు, కష్టనష్టాలు దూరమవుతాయని పెద్దలు చెబుతున్నారు.

అలాగే ఏలినాటి శని దోష నివారణకు శని విగ్రహాన్ని ఇనుముతో చేయించి, దానిని ఓ మట్టి కుండలోగానీ, ఇనుప పాత్రలో గానీ ఉంచాలి. దానిపై నల్లని వస్త్రమును కప్పి నల్ల పుష్పములు నల్ల గంధము, నల్లని పత్రములతో పూజించి బ్రాహ్మణునికి గానీ, శూద్రునికి గానీ సువర్ణ సహితముగా దానమివ్వాలి. దానితో పాటు నువ్వులు, పులగము దానము చేసినచో ఏలినాటి శని కొంతమేరకైనా నివృత్తి అగునని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా నవగ్రహ దోష నివారణకు ఏం చేయాలంటే..? ఏ గ్రహ శాంతికైనా చేసే అర్చన, దాన, హోమ, జపాదులను చిత్తశుద్ధితో చేయడం మంచిది. దేవతామూర్తులకు, సద్భ్రాహ్మణులకు గౌరవపూర్వక నమస్కారాలు చేసినట్లైతే కొంతమేరకు దోషవృత్తి తగ్గవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఏలినాటి శని గ్రహ దోష శాంతి విదానం :- ౧ మయూరి నీఎలం ధరించుట 2 శని జపం ప్రతి రోజు జపించుట 3 శని కి తిలభిషేకం చేఇంచుట 4 శివ దేవునకు అభిషేకం ,ప్రతి సనివారం రోజు ఎనిమిది రూపాయలు లేదా ఎనిమిది సంక్య వచ్చే లాగా బ్రహంనుకి దానం చేయుట 5 శని వారం రోజు నవగ్రహాల ఆలయం లో లేదా శివాలయం లో ప్రసాదం పంచుట 6 ప్రతి రోజు నువుండలు కాకులకు పెట్టుట వలన 7 శని వారం రోజు రొట్టి పై నువుల నూనే వేసి కుక్కలకు పెట్టుట వలన 8 హనుమంతుని పూజ వలన 9 సుందరకాండ లేదా నల చరిత్ర చదువత వలన 10 కాలవలో కానీ నది లో కానీ బొగ్గులు నల్ల నువులు మేకు కలపటం వలన 11 శని ఎకదాస నామాలు చదువత వలన ( సనేస్వర ,కోన, పింగల , బబ్రు, కృష్ణ , రౌద్ర ,అంతక , యమ, సౌరి, మంద ,చాయపుత్ర ) ప్రతి రోజు చడువటం వలన 12 బియపు రవ్వ మరియు పంచదార కలిపి చిమలకు పెట్టుట వలన 13 ఆవుకు నల్ల చెక్క ప్రతి రోజు పెట్టుట వలన 14 ప్రతిహి శని వారం రాగి చెట్టుకు ప్రదషణం మరిఉ నల్ల నువులు మినుములు కలిపినా నీటిని రాగి చెట్టు కు పోయటం వలన 15 ఇనుము తో చేసిన ఉంగరం ధరించుట వలన 16 చేపలు పట్టే పడవ ముందు బాగం లోని మేకు తో ఉంగరం చేసి ధరించుట వలన 17 బ్ర్హమనకు నల్ల వంకాయ, నల్ల నువులు, మేకు , నల్లని దుప్పటి దానం 18 ప్రతి శని వారం శివాలయం లేదా నవగ్రహలయం ముందు బిచ్చగాలకు ఆహరం పెట్టుట వలన నల్లని దుప్పటి దానం చేయటం వలన 19 అయ్యప్ప మాలా ధరించుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి కి తల నీలాలు ఇచ్చుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి మాలా ధరించుట వలన 20 ప్రతి శని వారం వెంకటేశ్వర స్వామి దరసనం శివాలయం లో శివుని దర్సనం హనుమంతుని దర్సనం వలన శని గ్రహ దోషం సాన్తిచ్చును